హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్యనారాయణ ఉద్వాసనకు ఇన్‌సైడర్ల ప్లాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీలోని ఆయన ప్రత్యర్థులు మౌనంగా మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి వర్గం నుంచి బొత్స సత్యనారాయణతో పాటు మోపిదేవి వెంకటరమణను తప్పించే ఉద్దేశంతో తెలుగుదేశం ఆరోపణలకు వారు మౌనంగా మద్దతిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. లిక్కర్ సిండికేట్లపై చేసిన దాడుల వివరాలకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మూడు వారాల్లోగా తమకు సమర్పించాలని హైకోర్టు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)ని ఆదేశించిందజి. బొత్స సత్యనారాయణను ఇబ్బందుల్లో పెట్టే ఉద్దేశంతో మద్యం సిండికేట్లపై ఎసిబి సమర్పించిన నివేదికను ప్రభుత్వం శాసనసభ ముందుంచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మద్యం సిండికేట్లపై అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న బొత్స సత్యనారాయణ శాసనసభా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు రోజులుగా శానససభకు వస్తున్నప్పటికీ లోనికి ప్రవేశించడం లేదు. బొత్సకు మద్యం సిండికేట్లతో గల సంబంధాలపై, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న మద్యం దుకాణాలపై వివరాలను కాంగ్రెసులోని ఆయన ప్రత్యర్థులు అందిస్తున్నట్లు చెబుతున్నారు. మద్యం సిండికేట్లపై చర్చ ముగిసిన తర్వాత సభలో తనపై వచ్చిన ఆరోపణల మీద శాసనసభలో ప్రకటన చేయడానికి బొత్స సత్యనారాయణ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

మద్యం సిండికేట్లతో సంబంధాలున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సోమవారం గవర్నర్ నరసింహన్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. బొత్సకు, మోపిదేవికి ఉద్వాసన చెప్పాలని డిమాండ్ చేస్తూ గన్ పార్కు వద్ద ధర్నా చేసేందుకు తెలుగుదేశం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

English summary
Chief minister N Kiran Kumar Reddy and those Congress leaders opposed to transport minister Botsa Satyanarayana are silently supporting TDP's campaign to effect the ouster of the PCC president and excise minister Mopidevi Venkataramana from the state cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X