వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహాల ఏర్పాటుపై జగన్ వర్గం జూపూడి వర్సెస్ టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: శాసనమండలిలో మంగళవారం విగ్రహాల అంశంపై వాడిగా వేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతులు లేకుండా విగ్రహాలు పెడుతున్నారని అనుమతులు లేని విగ్రహాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు పరోక్షంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఉద్దేశించి అన్నారు. విగ్రహాల ఏర్పాటుపై ఒక విధానం ఉండాలని సూచించారు. విగ్రహాలు ఇష్టం వచ్చినట్లుగా వెలుస్తున్నాయని వారు అన్నారు. టిడిపి నేతల వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు.

వైయస్సార్ అంటే అన్ని పార్టీలకు భయమని అందుకే విగ్రహాలు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపికి, జూపూడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా చనిపోయాక 25 ఏళ్ల తర్వాత విగ్రహం పెట్టాలని అన్నారు. మంత్రి మహిధర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదులో ఉన్న చాలా విగ్రహాలకు అనుమతులు లేవన్నారు. విగ్రహాల పెట్టే విధానంపై మంత్రివర్గ ఉప కమిటీలో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Leaders statues issue created very tension in counsil today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X