హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నేస్తే ఖబర్దార్: ముఖేష్‌కు అంజన్ కుమార్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Goud and Anjan Kumar Yadav
హైదరాబాద్: మంత్రి ముఖేష్ గౌడ్ వ్యాఖ్యలపై సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ మంగళవారం మండిపడ్డారు. సికింద్రాబాద్ ఏమైనా ముఖేష్ సొంతమా.. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నెస్తే ఖబర్దార్ అంటూ నిప్పులు చెరిగారు. తాను ఎక్కడి నుండి చేయాలో చెప్పడానికి ముఖేష్ ఎవరు అన్నారు. ఆయన ఏమైనా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదా వాటి ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అన్నారు. అసలు రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరమేమొచ్చిందని అన్నారు. 2004లో సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసేందుకు ఎవరూ సాహసించని సమయంలో తాను ధైర్యంగా బండారు దత్తాత్రేయపై పోటీ చేసి గెలిచానని అన్నారు. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచానన్నారు. ప్రజల్లోకి వెళ్లే వారికే గుర్తింపు ఉంటుందే తప్ప, పైరవీలు చేసి బతికేవారికి పరాభవం తప్పదన్నారు.

గోషామహల్‌లో ముఖేశ్ గౌడ్ దేవాదాయ శాఖ భూములు ఆక్రమించారని ఆరోపించారు. ముఖేశ్, ఆయన కుమారుడు కలిసి ప్రజలను దోచుకుతింటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తన మామ దేవేందర్‌గౌడ్‌ను అడ్డం పెట్టుకొని ముఖేశ్ అక్రమంగా రూ.కోట్ల ఆస్తిని కూడబెట్టాడని అంజన్ కుమార్ ఆరోపించారు. మంత్రి ముఖేశ్ సికింద్రాబాద్ ఎంపి సీటు గురించి ఆలోచించడం మానుకుంటే మంచిదని అంజన్ హితవు పలికారు. వైయస్‌కు నేను విన్నవించడం వల్లనే ముఖేష్‌కు మంత్రి పదవి దక్కిందని అది అతను గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి వైఖరిపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా 2014 ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తానని అంజన్ ముషీరాబాద్ నుండి పోటీ చేస్తారని మంత్రి ముఖేష్ గౌడ్ మంగళవారం ఉదయం చెప్పిన విషయం తెలిసిందే. ఈయన వ్యాఖ్యలపై అంజన్ మండిపడ్డారు.

English summary
Secunderabad MP Anjan Kumar Yadav denies shifting from seat, says minister Mukesh goud is not Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X