వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర విశ్వవిద్యాలయం లేడీ ప్రొఫెసర్, ఆమె భర్త అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Andhra University
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం లేడీ ప్రొఫెసర్‌ను, ఆమె భర్తను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కోడలిని వరకట్నం వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఉమాదేవి, ఆమె భర్త రామ్ గోపాల్ కోడలిని 25 లక్షల రూపాయల అదనపు కట్నం కోసం వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. రామ్ గోపాల్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఆగ్రో ఎకనమిక్స్ ప్రాజెక్టులో శాస్త్రవేత్తగా పని చేస్తున్నాడు. ఆ తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు.

అదనపు కట్నం కోసం తన కూతురిని వేధిస్తున్నారంటూ ప్రత్యూష తల్లిదండ్రులు ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, రామ్ గోపాల్ పెద్ద కుమారుడు శశి మల్లిక్‌తో విజయవాడకు చెందిన ప్రత్యూషతో వివాహం చేశారు. పెళ్లి సమయంలో ప్రత్యూష తల్లిదండ్రులు 8 లక్షల రూపాయల కట్నం, 15 తులాల బంగారం, పది లక్షల రూపాయల విలువ చేసే భూమి కట్నంగా ఇచ్చారు. అయినా మరింత కట్నం కోసం వేధింపులు సాగిస్తున్నారని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు.

English summary
A professor of Andhra University and her scientist-husband were arrested by the police on charges of harassing their daughter-in-law for additional dowry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X