వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ అజహరుద్దీన్‌కు ఎన్‌బిడబ్ల్యూ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mohammed Azharuddin
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మహ్మద్ అజహరుద్దీన్‌కు న్యూఢిల్లీ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్‌బిడబ్ల్యూ) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టులో హాజరు కానందుకు అజహర్‌కు ఈ వారెంట్ జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున అజహరుద్దీన్ కోర్టుకు హాజరు కాలేక పోతున్నారని, అందుకు అనుమతివ్వాలని అజహర్ తరఫు న్యాయవాది కోర్టుకు గతంలో విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల కారణంగా అజహర్ హాజరు కాలేక పోతున్నారన్న పిటిషన్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ర్టేట్ విక్రాంత్ వేద్ గురువారం కొట్టి వేసి మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

మార్చి 7వ తేదీలోగా ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. కాగా పది రోజుల క్రితం కూడా కోర్టు అజహర్‌కు కోర్టులో హాజరు కానందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ముంబయిలోని బాంద్రాలో అజహరుద్దీన్ ఆస్తి అమ్మకం లావాదేవీల్లో ఆయన తనకిచ్చిన రూ.1.5 కోట్ల చెక్కు చెల్లలేదని సంజయ్ సోలంకి అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. ఈ చెల్లని చెక్కు విషయంలో అజహర్ పలుమార్లు కోర్టుకు హాజరు కాలేదు.

English summary
A Delhi court Thursday issued a non-bailable warrant against former Indian cricket captain-turned-MP Mohammed Azharuddin after he failed to appear in person before a court in a dud cheque case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X