హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ జమానాలో చక్రం తిప్పిన ఎసి రెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన మీడియా కార్యదర్శిగా పనిచేసిన ఎసి రెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఎసిరెడ్డిగా ప్రాచుర్యం పొందిన ఎ చంద్రశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు గురువారం విచారించారు. వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు కోట్ల రూపాయల విలువైన వాణిజ్య ప్రకటనలను విడుదల చేసిన విషయంపై అప్పటి సమాచార కమిషనర్ పార్థసారథిని, ఎసిరెడ్డిని సిబిఐ అధికారులు ఒకే గదిలో కూర్చోబెట్టి ప్రశ్నించారు. సాక్షి దినపత్రికకు వాణిజ్య ప్రకటనలను జారీ చేసిన విషయంపై సిబిఐ అధికారులు గత నెల 21వ తేదీన పార్థసారథితో పాటు అప్పుడు సమాచార శాఖలో పనిచేసిన ప్రభాకరరావును, రాజబాబులను విచారించారు.

వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు నిర్దేశించడం వల్లనే సాక్షి పత్రికకు భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి, ఇతర ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక అదేశాలు రావడం వల్లనే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చామని వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఎ చంద్రశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి ఎ. చంద్రశేఖర రెడ్డి సూచన మేరకే ప్రకటనలు ఇస్తున్నట్లు అప్పట్లో ఓ ఫైలులో సమాచార శాఖ అధికారులు నోట్ చేశారు. దీంతో ఆయనను సిబిఐ గురువారం రెండున్నర గంటల పాటు విచారించింది. తాను వార్తలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చూశానని, వాణిజ్య ప్రకటనల వ్యవహారం తనకు తెలియదని అతను సిబిఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం అప్పటి సమాచార కమిషనర్ పార్థసారథిని రప్పించి, ప్రశ్నిస్తూ మధ్యలో పక్క గదిలో ఉన్న చంద్రశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు పిలిచారు. ఆ తర్వాత పార్థసారథిని పంపించేసి చంద్రశేఖర రెడ్డిని మళ్లీ విచారించారు.

English summary
A Chandrasekhar Reddy, former media secretary of YS Rajasekhar Reddy was grilled by CBI in YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X