హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పరువు నష్టం దావా

By Pratap
|
Google Oneindia TeluguNews

Vemuri Radhakrishna
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎమ్మార్ వ్యవహారంపై రాసిన వార్తాకథనాలపై పారిశ్రామికవేత్త కె. రఘురామ రాజు వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు రెండో అదనపు చీఫ్ జడ్జి ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు, సంపాదకుడు కె. శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేశారు. మీడియా పరిధి దాటి వ్యవహరించిన సందర్భాల్లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు విన్నవించాలని న్యాయమూర్తి పిటిషనర్‌కు సూచించారు. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాల వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, దానివల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాయనని పిటిషనర్ తెలిపారు.

తన పరువుకు నష్టం కలిగించినందుకు 25 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని రఘురామరాజు న్యాయమూర్తిని కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. రఘురామరాజును ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ సాక్షిగా విచారించిందని, దాదాపు 40 మంది సాక్షులను విచారించిందని, అందరినీ విచారించినట్లే రఘురామరాజును కూడా విచారించిందని, అయితే రఘురామరాజును సహనిందితునిగా చేయనున్నారని ఆంధ్రజ్యోతి రాసిందని ఆయన తరఫు న్యాయవాది లోకేష్ రెడ్డి వాదించారు.

English summary
Court issued notice to Andhrajyothy managing director Vemuri Radhakrishna in a defamation petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X