హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రలో చిచ్చుకు కెసిఆర్ ప్రయత్నం: టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ విమర్శించారు. ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకే ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు శానససభా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తానని కెసిఆర్ చెబుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులపై స్పీకర్ వేటు వేస్తూ సరైన నిర్ణయమే తీసుకున్నారని, వేటు బాధాకరమే అయినప్పటికీ అది సరైన నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన అన్నారు.

కొందరి వ్యక్తిగత ప్రతిష్ట కోసమే ఉప ఎన్నికలు తీసుకువచ్చారని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఉద్యమంలో పెట్టిన కేసులను దశలవారీగా ఎత్తివేస్తామనే నమ్మకం ప్రజల్లో కలిగిందని ఆమె శనివారం మహబూబ్‌నగర్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశానికి కాంగ్రెసు కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. తెలంగాణపై తమ పార్టీకి ఎప్పటి నుంచో స్పష్టత ఉందని ఆమె అన్నారు.

తమ కాంగ్రెసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎమ్మెల్సీలపై కూడా త్వరలో వేటు పడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్లులో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై స్పీకర్ వేటు వేయడం సముచితమేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో కాంగ్రెసు గెలుస్తుందని, మిగిలిన స్థానాల్లో రెండో స్థానంలో ఉంటుందని ఆయన అన్నారు.

English summary
Minister TG Venkatesh said that TRS president KCR is trying to hatch conspiracy in Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X