వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూత్ ఐకాన్‌గా...: రాహుల్‌‌ గాంధీని దాటేసిన అఖిలేష్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi and Akhilesh
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ ఔట్ స్టాండ్ చేశారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. యుపి ఎన్నికల్లో రాహుల్ మాయాజాలం పని చేస్తుందని కాంగ్రెసు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం రాహుల్ మాయ పని చేయలేదని అర్థమవుతోంది. అయితే కాంగ్రెసు నేతలు ఓ వైపు ఎగ్జిట్ పోల్స్‌ను తప్పు పడుతూనే మరోవైపు ఫలితాలకు రాహుల్ బాధ్యుడు కాదని చెప్పడం గమనార్హం. యుపి ఎన్నికల్లో రాహుల్ యూత్ ఐకాన్‌గా ఉంటాడని కాంగ్రెసు నేతలు భావించారు. కానీ అఖేలేష్ రేసులో ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చారు. రాహుల్, అఖిలేష్ ఇరువురు తమ తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రజలకు చెప్పారు. చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. అయితే చెప్పిన అంశం రాహుల్ కంటే అఖిలేషే ఓటర్లకు నమ్మకం కలిగించేలా ఉందని సర్వేలో తేలిందంట.

యుపి ఓటర్లను రాహుల్ కంటే అఖిలేష్ బాగా ప్రభావితం చేశారని అంటున్నారు. రాహుల్‌తో పోలిస్తే బహిరంగ సభల్లో అఖిలేష్ మాట్లాడింది తక్కువే అయినప్పటికీ బాగానే ప్రభావితం చేశారట. అఖిలేష్ సభల్లో కంటే ర్యాలీలలో ఎక్కువగా పాల్గొని యువతను ఆకట్టుకున్నారు. ఇక కాంగ్రెసులో రాహుల్, ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రా ముగ్గురూ ప్రచారానికి వచ్చి అంతా కంగాళీ చేశారని అంటున్నారు. ఎస్పీ తరఫున మాత్రం అఖిలేష్ ఒక్కరే పాల్గొన్నారు. ఉపాధి హామీతో ఆకట్టుకున్న అఖిలేష్ అదే సమయంలో కాబోయే హైటెక్ సిఎంగా ఫోకస్ అయ్యారు. ప్రజలు కూడా రాహుల్ గాంధీని నాన్ లోకల్‌గా అఖిలేష్‌ను లోకల్ లీడర్‌గా చూశారని అంటున్నారు.

English summary
It seems, SP leader Akhilesh Yadav outstanded AICC general secretary Rahul Gandhi in Uttar Pradesh elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X