వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం సింగే యుపి ముఖ్యమంత్రి: అఖిలేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh and Mulayam Singh Yadav
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ అధినేత, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి కానున్నారని సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సోమవారం స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒకరోజు ముందు అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుందన్న నమ్మకం ఉందని, మా పార్టీ అధినేత ములాయం ముఖ్యమంత్రి కానున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం మేమంతా బాగా కష్టపడ్డామని, మా కష్టానికి ఫలితం ఉంటుందని భావిస్తున్నామని అఖిలేష్ చెప్పారు. పార్టీ మెజార్టీ సాధించిన పక్షంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని విలేకరులు అడగడంతో .. నేతాజీ(ములాయం)యే పార్టీలో అందరి ఛాయిస్ అని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు సమష్టిగా సిఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని, అందరూ నేతాజీనే సూచిస్తారని తాను భావిస్తున్నానని, ఆయనే సిఎం కానున్నారన్నారు.

పొత్తులపై ప్రశ్నించగా... తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆయన చెప్పారు. తాము ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బిఎస్పీకి తమ మద్దతు అన్న కాంగ్రెసు నేత బేణి ప్రసాద్ వర్మ వ్యాఖ్యలపై స్పందిస్తూ... అది ఆయన ఆలోచన అని, ఆయన వ్యాఖ్యలను పార్టీ చూసుకుంటుందని చెప్పారు. కాగా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం బేణి ప్రసాద్ వర్మ, హంగ్ ఏర్పడితే బిఎస్పీకి మద్దతిస్తామని, అది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు.

English summary
With just a day left for counting of votes, the Samajwadi Party on Monday said it was hopeful of getting a majority in Uttar Pradesh and party supremo Mulayam Singh Yadav will become the next Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X