వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా బిజెపి వశం, ఉత్తరాఖండ్‌లో అంతుపట్టని నాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Goa Map
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా ఉంది. రెండు పార్టీలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారో అంతు చిక్కడం లేదు. అంతిమంగా అందిన సమాచారం మేరకు కాంగ్రెసు 30 స్థానాలలో, బిజెపి 31 స్థానాలలో ముందంజలో ఉంది. ఇతరులు తొమ్మిది స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఆరంభం నుండి ఉత్తరాఖండ్‌లో కాంగ్రెసు, బిజెపి నువ్వా నేనా అన్నట్లు ఉంది. ముఖ్యమంత్రి బిసి ఖండూరి అవినీతి తమకు లబ్ధి చేకూరుస్తుందని కాంగ్రెసు నేతలు భావించారు. తమకు భారీ మెజార్టీ ఇస్తారని వారు భావించారు. కానీ ఫలితాలు ఇరుపార్టీలతో దోబూచులాడుతున్నాయి. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. గెలుపు కోసం 36 సీట్లు గెలుచుకోవాలి.

ఇక గోవాలో కాంగ్రెసుకు చుక్కెదురయింది. నిన్నటి వరకు అధికారంలో కాంగ్రెసును ప్రజలు గద్దెదించారు. బిజెపి ఎనిమిది సీట్లలో గెలిపొంది మరో ఎనిమిది సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు కేవలం రెండు సీట్లలో గెలిచి మరో రెండు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒకస్థానంలో గెలుపొంది మూడు స్థానాలలో ముందంజలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బిజెపి అధికారం కైవసం చేసుకోనుంది.

English summary
Assembly elections results 2012, Early trends show lead for BJP and SP in UP, Congress in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X