వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ భవిష్యత్తేంటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi-Rahul Gandhi
లక్నో: గాంధీ కుటుంబాలకు కంచుకోట అయిన రాయ్‌బరేలీ, అమేథీలలో కాంగ్రెసు పార్టీ ఘోరంగా దెబ్బతినటంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ భవిష్యత్తు ఆ నియోజకవర్గాల్లో ఏమిటనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. అయితే గాంధీ కుటుంబాలకు ఏళ్లుగా అండగా ఉంటున్న రాయ్‌బరేలీ, అమేథీలలో కూడా పార్టీ దెబ్బతినడం కాంగ్రెసు జీర్ణించుకోలేక పోతోంది. సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో కాంగ్రెసు పార్టీ ఐదు నియోజకవర్గాల్లో దెబ్బతింది. కేవలం ఒక స్థానంలో మాత్రమే గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదంటున్నారు. ఇక్కడ మూడు స్థానాల్లో సమాజ్ వాది, ఒక స్థానంలో బిజెపి గెలుపొందే అవకాశం ఉండగా, కేవలం ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెసు గట్టెక్కనుందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పది నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో విపక్షాలు గెలుపొందే అవకాశం ఉండగా కేవలం రెండు నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెసుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 2014లో వచ్చే సాధారణ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు నియోజకవర్గాలు మారాలా? లేక రెండు నియోజకవర్గాలలో పోటీ చేయాలా? అనే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. వారి పార్లమెంటు పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో విపక్షాలు గెలుపొందడంతో సోనియా, రాహుల్‌ గెలుపు కష్టంగా మారనుందని అంటున్నారు. ఒకవేళ గెలిచినా అది బోటాబోటీ మెజార్టీతో మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాం నుండి గాంధీ కుటుంబాలకు పట్టం కట్టిన రాయ్‌బరేలి ప్రజలు ఈసారికి కొత్తగా పుట్టుకు వచ్చి పీస్ పార్టీకి పట్టం కడుతున్నారు. తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన పీస్ పార్టీ కాంగ్రెసును చావుదెబ్బ కొట్టిందనే చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాలలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2014లో పార్లమెంటు స్థానాలకు పీస్ పార్టీ పోటీ చేసిన పక్షంలో సోనియా, రాహుల్ గెలుపు క్లిష్టంగా మారనుందని అంటున్నారు. అయితే అసెంబ్లీ ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపయని మరికొందరు అంటున్నారు. ఆ నియోజకవర్గాలలో వారికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు.

English summary
Congress Party defeated in eight of ten seats in Raebareli and Amethi parliament constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X