వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, అఖిలేష్, మోడి...: రాహుల్ గాంధీకి పెద్ద సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi and YS Jagan and Akilesh Yadav
న్యూఢిల్లీ: ఎప్పుడు ప్రధాని పీఠాన్ని అధిష్ఠిస్తారా అని కాంగ్రెసు వర్గాలు ఎదురు చూస్తున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్షి రాహుల్ గాంధీకి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలల్లో చుక్కెదురు కావడంతో ఆయన దేశంలోని పలు రాష్ట్రాల యూత్ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ రాజకీయ స్థితిగతుల్ని మార్చేసే ఉత్తర ప్రదేశ్‌పై రాహుల్ ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ యుపికి అధికారం దూరమై ఇరవై రెండేళ్లు. ఈసారైనా అత్యధిక స్థానాలు గెలుపొంది కోల్పోయిన తమ ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని రాహుల్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకోసం యుపిలో రాహుల్ ఎడతెరిపి లేకుండా ప్రచారం చేశారు. మొత్తం 218 నియోజకవర్గాల్లో 221 సభలను ఏర్పాటు చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీ కారణంగా యుపిలో భారీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెసు మొదట భావించింది. కానీ ఫలితాలు మాత్రం దిమ్మదిరిగేలా వచ్చాయి. సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను రాహుల్ ఎదుర్కోలేక పోయారని అంటున్నారు. ప్రచారంలో రాహుల్ ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయారు. కానీ అఖిలేష్ మాత్రం ఎస్పీ చేయబోయే అంశాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు.

అఖిలేష్ తన ప్రచారంలో ప్రధానంగా యువతని ఆకర్షించారు. అదే సమయంలో రాహుల్ మాత్రం యువతను ఆకర్షించడంలో ఫెయిల్ అయ్యారు. ప్రచారం సమయంలో చిత్తుకాగితాలను చించేస్తూ విపక్షాల మేనిఫెస్టోను వాటితో పోల్చడం తదితర అంశాలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయంటున్నారు. తాము అధికారంలోకి వస్తే రౌడీల పాలన ఉండదని, అభివృద్ధి, సంక్షేమం పైనే దృష్టి సారిస్తామని అఖిలేష్ సామాన్యులను కూడా బాగా ఆకర్షించారు. ఇన్నాళ్లూ దేశంలో రాహుల్ గాంధీ ఒక్కరే యూత్ ఐకాన్‌గా ఉండేవారు. కానీ దేశంలోనే అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ రేసులోకి దూసుకు వచ్చారు. రాహుల్‌ను వెనక్కి నెట్టేశాడు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ తనయుడు జయంత్ సింగ్ కూడా రాహుల్ కంటే యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడని అంటున్నారు. యుపిలో రాహుల్ మేనియా దెబ్బతినడంతో భవిష్యత్తులో ఆయా రాష్ట్రాలలో యూత్ ఐకాన్‌గా స్థానిక నేతలే ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తద్వారా కాంగ్రెసు దెబ్బతినే అవకాశముందంటున్నారు.

ఇప్పటికే దక్షిణ భారత దేశంలో పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి యూత్ ఐకాన్‌గా ఎదిగారు. ఆయనపై సిబిఐ దర్యాఫ్తు, అరెస్టులు తదితర విషయాలు పక్కన పెడితే ఎపిలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. యువత దాదాపు ఆయన వైపు చూస్తోంది. అందుకే అక్కడ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీలు యువతను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్‌ను సామాన్యులు ఆదరిస్తున్నారు. ఇక గుజరాత్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రాభవం ముందు జగన్ దిగదుడుపే అంటున్నారు. మోడీని మించిన ఐకాన్ ఆ రాష్ట్రానికి లేరంటున్నారు. ఆ ఇమేజే ఆయనను బిజెపి ప్రధాని పదవి అభ్యర్థికి పరిశీలించే పరిస్థితి కల్పించిందని చెప్పవచ్చు. ఇక మహారాష్ట్రలో నవనిర్మాణ సేన్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తదితరులను ఎదుర్కోవడం కష్టమే అంటున్నారు.

English summary
BJP state president Kishan Reddy said that people rejected Rahul Gandhi leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X