వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజంపై ఓడిన జయప్రద, ఆంధ్రకు తిరుగు టపా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
లక్నో: తన ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌ను ఓడించడానికి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి శానససభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటి జయప్రద తానే ఓటమి పాలయ్యారు. ఆజంఖాన్‌పై ఓడిపోయిన జయప్రద ఆంధ్రప్రదేశ్‌కు తిరుగుటపా కట్టవచ్చునని అంటున్నారు. తనకు రాంపూర్ అయినా, రాజమండ్రి అయినా ఒక్కటేనని ప్రకటించిన ఆమె ఇప్పుడు రాంపూర్‌ను వదులుకోక తప్పడం లేదని అంటున్నారు. రాంపూర్ లోకసభ స్థానం నుంచి రెండు సార్లు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఆమె లోకసభకు గెలిచారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గాను అమర్ సింగ్‌తో పాటు జయప్రద సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అమర్ సింగ్ ఏర్పాటు చేసిన రాష్ట్రీయ లోక్‌మంచ్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. గత లోకసభ ఎన్నికల్లోనే ఆజం ఖాన్ జయప్రదకు చుక్కలు చూపించారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆజంఖాన్ మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జయప్రద ఆజంఖాన్ దాటికి తట్టుకోవడం కష్టమే అవుతుంది. దీంతో ఆమె రాంపూర్‌ను ఖాళీ చేయక తప్పదని అంటున్నారు.

జయప్రద గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆమెకు అవకాశం ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి జయప్రద పట్ల ఏ మాత్రం సానుకూలంగా లేరని చెబుతున్నారు. జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీలో చేరుతారో చూడాల్సిందే.

English summary
Defeated NY Azam Khan in Rampur constituency Telugu actress may return to Andhra Pradesh politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X