వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌గాంధీ యుపికే కాదు: అఖిలేష్‌యాదవ్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi and Akhilesh
లక్నో: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కేవలం ఉత్తర ప్రదేశ్‌కే పరిమితం కాదని, ఆయన జాతీయ స్థాయి నేత అని సమాజ్ వాది పార్టీ నేత, ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ సింగ్ యాదవ్ మంగళవారం కౌంటర్ వేశారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలలో మెజార్టీ సీట్లు మావేనని ఆయన చెప్పారు. యుపిలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందన్నారు. ఎస్పీ కార్యకర్తలు గతంలో ఎప్పుడూ నేరాలకు పాల్పడలేదని ఆయన చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక నేరపూరిత ఘటనలు పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చారు. సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎస్పీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఎస్పీ అధికారాన్ని చేజిక్కుంచుకునే దిశలో దూసుకుపోతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు హంగామా చేస్తున్నారు. మరోవైపు తాము ఎస్పీకి మద్దతిచ్చే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెసు పార్టీ కూడా తాము ఎస్పీకి గాని, బిఎస్పీకి గానీ మద్దతి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాయి. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ దూసుకు పోతున్నప్పటికీ హంగ్ ఏర్పడనుందని పరీశీలకులు భావిస్తున్నారు. ఎవరికి వారే మద్దతు లేదని పైకి చెబుతున్నప్పటికీ, పొత్తుల కోసం పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.

English summary
Assembly elections results 2012, Early trends show lead for BJP and SP in UP, Congress in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X