హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడాదిలో సునీల్ రెడ్డికి రూ. 50 కోట్లు వచ్చాయి: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్ : ఎమ్మార్ కేసులో నిందితుడు ఎన్.సునీల్ రెడ్డికి ఓ కంపెనీ ఉందని, దాని పేరు 'సౌత్ ఎండ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్' అని, అందులోకి ఏకంగా రూ.51 కోట్లు వచ్చాయని సిబిఐ అన్నది. సునీల్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలిందని, ఎమ్మార్‌లో విల్లాలు, ప్లాట్లు అమ్మడం ద్వారా వచ్చిన రూ.96 కోట్లను సునీల్ ఎవరికి ఇచ్చారో తేలాలని, దాన్నే దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది బళ్లా రవీంద్రనాథ్ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించారు.

సునీల్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు సాగాయి. ఎమ్మార్ కేసులో విల్లాల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును సునీల్‌రెడ్డి తన కోసమే వసూలు చేశారా? వేరెవరి కోసమైనా ఆ పని చేశారా? అని న్యాయమూర్తి నాగమారుతీ శర్మ ప్రశ్నించారు. దీనికి రవీంద్రనాథ్ బదులిస్తూ - "తుమ్మల రంగారావు, ఆయన అకౌంటెంట్ శ్రీనివాసరావు వద్ద తీసుకున్న విల్లాల సొమ్ము రూ.96 కోట్లు ఎక్కడికి వెళ్లాయన్నది తేలలేదని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

సునీల్ రెడ్డికి రాజకీయంగా పలుకుబడి ఉందని, జగన్‌తో, అప్పటి సీఎంతోనూ సునీల్ రెడ్డికి సాన్నిహిత్యం ఉందని, బెయిల్ ఇస్తే కేసును ఆయన ప్రభావితం చేయవచ్చునని వాదించారు. తాను అమాయకుడనని సునీల్‌రెడ్డి భావిస్తే నార్కో అనాలసిస్‌కు ఒప్పుకోవాలని సూచించారు. వాస్తవానికి, 2004-10 మధ్య కాలంలో తమ కుటుంబానికి రూ.99 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆదాయ పన్ను రిటర్నుల్లో సునీల్ రెడ్డి పేర్కొన్నారని, కానీ, దానికి మూడు రెట్లు ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని కోర్టుకు విన్నవించారు.

English summary

 In a move to further link YSR Congress chief Jaganmohan Reddy to the Emaar scam, the CBI on Tuesday told the special court that Rs 50 crore had flowed into the firm of accused No. 2 N Sunil Reddy from different sources in 2009-10 alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X