హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబినెట్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు: హైకోర్టు ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ మీనా దుబాయ్‌లో రెండు విల్లాలు అడిగారని, ఆ రెండు విల్లాలు ఇస్తే వ్యవహారం పరిష్కరిస్తానని చెప్పారని ఎమ్మార్ ఎంజిఎఫ్ తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. ఎమ్మార్ విల్లాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కోసం వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. ప్లాట్ యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్లాట్లను, విల్లాలను కొనుగోలు చేయానలి అడిగిన మీరే రిజిస్ట్రేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. భూమి కేటాయింపు కుంభకోణం వ్యవహారంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని, అప్పటి మంత్రివర్గాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, ప్రాజెక్టుపై ఎందుకు సమీక్ష చేయడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన యజమానులది తప్పని తేలితే సిబిఐ చూసుకుంటుందని చెప్పింది. లాభాలు, షేర్ల విషయాలను ఎమ్మార్, ఎపిఐఐసి చూసుకోవాలని సూచించింది. ఒప్పందం మేరకు విల్లాలను, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదని కొనుగోలుదారులు ఆరోపించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, రూ. 29 లక్షలకు ఎకరా చొప్పున ఎమ్మార్‌కు విక్రయించారని చెప్పింది. ఈ కేసులో విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విల్లాలు, స్థలాలు కొనుగోలు చేసినవారు నష్టపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం రుచి మరిగిందని వ్యాఖ్యానించింది.

English summary
High Court questioned Government on EMAAR land allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X