వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి పీఠం: అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర ఒత్తిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సమాజ్ వాది పార్టీలో సస్పెన్స్‌కు తెర పడలేదు. బుధవారం ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యేలు లక్నోలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అర్ధాంతరంగా ఆ సమావేశం వాయిదా పడింది. హోళీ పండుగ తర్వాత సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. అయితే సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు పార్టీని గెలుపు గుర్రమెక్కించిన అఖిలేష్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. అఖిలేష్‌ను సిఎం చేస్తేనే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారట. అయితే అఖిలేష్ మాత్రం తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని మరోసారి తేల్చి చెప్పారు. తన తండ్రి, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవే ముఖ్యమంత్రి కానున్నారని స్పష్టం చేశారు. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ములాయం సింగ్ ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం గమనార్హం.

అఖిలేష్ చెప్పినట్లుగా ప్రస్తుతానికి ములాయం సింగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, కొన్నాళ్ల తర్వాత బాధ్యతలు తనయుడుకి అప్పగించే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేల నుండి వస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో యుపిలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా, ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలన్న అఖిలేష్ వంటి నాయకుడిని సిఎంగా చేయడమే ఉత్తమమని పార్టీ నేతలు పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ములాయం దృష్టికి తీసుకు వెళుతున్నారట.

English summary
Samajwadi Party mlas pressuring on Akhilesh Yadav to undertake charge as CM of UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X