• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గంగా భవానీ, రజినీ రెడ్డి వర్గాల సిగపట్లు, వార్

By Pratap
|

Ganga Bhavani
హైదరాబాద్: మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెసు సమావేశం గురువారం రసాభాసగా మారింది. మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు గంగా భవానీ, మరో నేత రజినీరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రజినీ రెడ్డి వర్గీయులు గంగా భవానీ వర్గంపై విరుచుకుపడ్డారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పరస్పరం కొట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది.

తనను సమావేశానికి ఆహ్వానించకపోవడంపై రజినీ రెడ్డి గంగా భవానీపై మండిపడ్డారు. కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తూ గంగా భవానీ కావాలనే తనను పక్కన పెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చి రేఖ అనే మహిళకు సమావేశ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై కూడా రజినీ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. గాంధీభవన్‌లో నాయకులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నాలు చేశారు. సమాచారాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా చేరవేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Clash took place between leaders Mahila Congress Ganga Bhavani and Rajini Reddy groups at Gandhibhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more