హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అరెస్ట్‌పై రామోజీకి ఎవరు చెప్పారు?: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం ప్రశ్నించారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో గాని, ఆ తర్వాత జరిగే పదిహేడు నియోజకవర్గాలలోని ఉప ఎన్నికలలో కానీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. జగన్ పైన కుట్ర చేసి దొంగగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఈనాడు తదితర పత్రికలపై మండిపడ్డారు. సిబిఐ విచారణలో జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లభించలేదన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం జగన్ ను అరెస్టు చేస్తారని దుష్ప్రచారం చేస్తోందన్నారు. జగన్ ను అరెస్టు చేస్తారని రామోజీ రావుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆందోళన సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పేద ప్రజల పొట్ట కొట్టి రామోజీ రావు భూములు సంపాదించారని అన్నారు. ఆ భూముల్లోనే అతను కోట్లు పెట్టి స్టూడియో కట్టారని ఆరోపించారు. రామోజీకి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసునన్నారు.

జగన్‌ను దొంగగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు దొంగో తేలుతుందన్నారు. ఉప ఎన్నికలు రాబోయే స్వర్ణయుగానికి పునాదులు అన్నారు. దొంగ ఎవరనేది కడప ఉప ఎన్నికలు ఇప్పటికే చెప్పాయని త్వరలో కొవ్వూరు, ఆ తర్వాత ఉప ఎన్నికలు తెలియజేస్తాయన్నారు. కాంగ్రెసును వీడతారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అబద్దం చెప్రారో నిజం చెప్పారో సోనియా గాంధీ, ఆ పార్టీ తెలుసుకోవాలన్నారు. నాలుగు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు మారుతాయన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu questioned that who told to Ramoji Rao on Jaganmohan Reddy arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X