హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వివేకా: జగన్‌కు దూరమై, కాంగ్రెస్‌కు పట్టక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది. అటు అబ్బాయ్‌కి దూరమయ్యారు, ఇటు కాంగ్రెసు నాయకత్వం పట్టించుకోవడం లేదు. గత నెల రోజులుగా ఆయన రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, అధిష్టానం పెద్దలను కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆయనకు రాజ్యసభ సీటు దక్కే పరిస్థితి లేదు. ఏడాది కాలంగా ఆయన పదవి ఏదీ లేదు. అయినా పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు.

మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనను పట్టించుకున్నవారు లేరు. వైయస్ కుటుంబానికి దగ్గర కావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వైయస్ జగన్‌ కాస్తా సానుకూలంగా ఉన్నా, వైయస్సార్ సతీమణి విజయమ్మ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెసులోనే ఏదో పదవిని పొందాలనే ఉద్దేశంతో రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగించినట్లు చెబుతారు. కానీ తన పేరును రాజ్యసభకు ప్రతిపాదించేవారే లేకుండా పోయారు.

ఈ స్థితిలో ఆయన కాంగ్రెసు నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కకపోతే మరో ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దీంతో తనను పార్టీ మోసం చేస్తోందనే భావనకు ఆయన గురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో తాను పులివెందులలోనే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీ నాయకులు తిరిగి తన వద్దకు వచ్చినప్పుడే చూసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that ex minister and YSR brother YS vivekananda Reddy is angry with Congress leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X