వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 ఉప ఎన్నికల్లో జగన్‌కు మద్దతివ్వం: రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPM Raghavulu
న్యూఢిల్లీ: రాబోయే ఉప ఎన్నికల్లో కానీ, 2014 సాధారణ ఎన్నికల్లో కానీ తాము ప్రాంతీయ పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇవ్వమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం స్పష్టం చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ అని, ప్రజా సమస్యలపై ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలను బట్టి మా వైఖరి ఉంటుందని ఆయన అన్నారు. ఆ పార్టీ కోసం ఒక వైఖరి తీసుకుని పొత్తు గురించి ఆలోచించలేదని, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కలిసి పనిచేయడం వేరు, రాజకీయాల్లో సర్దుబాట్లు చేసుకోవటం వేరన్నారు. ఏదో ఒక పార్టీవైపు వెళ్లడమే తమ పని కాదని, ఎన్నికలప్పుడు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులను బట్టి ఆరోజు తమ పార్టీ తీసుకునే ఎత్తుగడలనే రాష్ట్రంలోనూ అనుసరిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ, రాష్ట్ర రాజకీయాలను శాసించేవి కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధోగతి పాలైందని, తెలంగాణ సమస్యను సృష్టించి, దానిని పరిష్కరించలేకపోవటంతో ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి శృంగభంగం తప్పదని స్పష్టం చేశారు. 2009లో తాము సమైక్యాంధ్రకు, సిపిఐ తెలంగాణకు మద్దతు పలికినా ఎన్నికల్లో కలిసే పని చేశామని, టిడిపి ఒకవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర అని ప్రకటించినా ఆ పార్టీతో కలిసి పనిచేశామని, అందువల్ల, సిపిఐతో సర్దుబాట్లకు తెలంగాణ అంశం ఆటంకం కాదని స్పష్టం చేశారు. పత్తి ఎగుమతులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజల అసంతృప్తిని ఉద్యమాల దిశగా మళ్లించడంపైనే తాము దృష్టి సారించామని, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదని చెప్పారు.

English summary
CPM Raghavulu said that their party will not support YS Jaganmohan Reddy in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X