• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మగాడివైతే రా!: రాజీనామాపై బాబుకు కెసిఆర్ సవాల్

By Srinivas
|

kcr - chandrababu
మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ వచ్చి తనను ఎంపీ పదవికి రాజీనామా చేయమని సవాల్ చేశారని తాను దానిని స్వీకరిస్తున్నానని మగాడివైతే అతను కూడా తన తన సవాల్ స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ప్రతి సవాల్ విసిరారు. కెసిఆర్‌కు రాజీనామా చేయడం ఒక లెక్క కాదన్నారు. తానొక్కడినే కాదని, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రాజీనామాకు సిద్ధమా అని ఆయన బాబుకు ప్రతి సవాల్ విసిరారు. మగాడివైతే, చీమునెత్తురు, సిగ్గు, శరం ఉంటే ఈ సవాల్ స్వీకరించాలన్నారు. బాబులా లత్కోరు వాళ్లు, మాయల మరాఠీలు తెలంగాణలో లేరన్నారు. ఈ గడ్డపై పుట్టిన కుక్కమూతి పిందేలు, సన్నాసుల వల్లనే చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతలకే సవాల్ విసిరుతున్నారన్నారు. తెలంగాణకు టిడిపి, కాంగ్రెసు చేసిన మోసాన్ని ఓటుతోనే కొట్టాలన్నారు. చంద్రబాబుది అంతా నీచ చరిత్ర, కుట్రల చరిత్ర అన్నారు. తెలంగాణ ఇచ్చేది కేంద్రం అంటున్న చంద్రబాబు 2009 డిసెంబర్ 9న ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు.

మన తెలంగాణలో నీళ్లు, బొగ్గు ఉంటే సీమాంధ్రులు లబ్ధి పొందుతున్నారన్నారు. తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణను అడ్డుకున్నదే చంద్రబాబు అన్నారు. సీమాంధ్ర నేతల రాజీనామా పత్రాలు తయారయిందే చంద్రబాబు చాంబరులో అన్నారు. చిరంజీవి, చంద్రబాబు, కిరణ్ అందరూ ఒక్కటై వచ్చిన తెలంగాణ అడ్డుకున్నారన్నారు. రాజీనామా డ్రామాలతో తెలంగాణ వెనక్కి పోయిందన్నారు. చంద్రబాబుది పక్కా ఆంధ్రా పార్టీ అన్నారు. మిగతా పార్టీల్లో తెలంగాణ వారు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, కానీ టిడిపిలో మాత్రం ఆ అవకాశం లేదన్నారు. కాంగ్రెసు ఆంధ్రా నాయకుల చెప్పు చేతల్లో ఉండే పార్టీ అన్నారు. టిడిపి, కాంగ్రెసులను వంద మీటర్ల లోతున పాతి పెట్టాలన్నారు. తెలంగాణకు బాబు శకుని అయితే కిరణ్ శని అన్నారు. కాంగ్రెసుకు ఐదు రాష్ట్రాల్లో దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయన్నారు.

తెలంగాణ ప్రజల్లో జాగృతం వచ్చిందన్నారు. మనకు రావాల్సిన నీటి వాటా, ఉద్యోగాల గురించి నాకు ఉండే బాధ చంద్రబాబు, కిరణ్‌కు ఉంటుందా అన్నారు. ఇది వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావన్నారు. తెలంగాణ వస్తే పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ప్రవేశ పెడతామన్నారు. నా ఒక్కడి వల్లే తెలంగాణ రాదని ఆయన అన్నారు. అందరం కలిస్తేనే తెలంగాణ సాధిస్తామని అన్నారు. వోట్ల కోసం లిక్కర్లు పంచుతున్న నీచుడు చంద్రబాబు అన్నారు. ఈ సభతో జూపల్లి కృష్ణా రావును గెలిపిస్తారనే నమ్మకం నాకు ఏర్పడిందన్నారు. అందరూ కారు గుర్తుకు ఓటు వేయడమే కాకుండా కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్ దక్కకుండా చేయాలన్నారు.

English summary
TRS chief K Chandrasekhar Rao challenged TDP chief 
 
 Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X