వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ మాఫియా లింక్స్, ఏడుగురు పోలీసాఫీసర్ల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

ACB Logo
హైదరాబాద్: మద్యం మాఫియాతో సంబంధాలున్న ఏడుగురు పోలీసు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఆదివారం అరెస్టు చేసింది. దీంతో పోలీసు శాఖలో వణుకు ప్రారంభమైంది. ఎసిబి ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన ఏడుగురు సీనియర్ అధికారుల్లో ముగ్గురు డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్లు ఉన్నారు. అరెస్టయినవారిలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కర్నూలు జిల్లాలోకు చెందిన సీనియర్ పోలీసు అధికారులను మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు తీసుకున్నందుకుగాను ఎసిబి అరెస్టు చేసింది.

మామూళ్లు తీసుకుని ఆబ్కారీ చట్టం నిబంధనలను ఉల్లంఘించడానికి మద్యం సిండికేట్లకు అవకాశం కల్పించారనేది పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణ. గతంలో మహబూబాబాద్ డిఎస్పీగా పనిచేసిన ప్రస్తుత కొత్తగూడెం ఓఎస్డీ శ్రీరామ్ ప్రసాద్‌, ఆదిలాబాద్ ఓఎస్డీ బి. ఉమామహేశ్వర్, పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న డిఎస్పీ వీరేశ్వరరావు, సుబేదారి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రణధీర్, ఖాజీపేట సిఐ విజయ సారథి, ఆదిలాబాద్ (రూరల్) సిఐ వి. శ్రీధర్ రావు, కర్నూలు పోలీసు కంట్రోల్ రూం సిఐ బి గుణశేఖర్ బాబు అరెస్టయ్యారు.

English summary
Sending shockwaves through the police department, Anti-Corruption Bureau (ACB) personnel on Sunday arrested seven senior police personnel for their ties with the liquor mafia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X