వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై 'మమత': అఖిలేష్ ప్రమాణానికి దీదీ డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee - Akilesh Yadav
కోల్‌కతా: గత కొంతకాలంగా కాంగ్రెసు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మమత కురిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రమాణ స్వీకారోత్సవానికి దీదీకి ఆహ్వానం అందింది. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి తాను వెళ్లకూడదని ఆమె ఆదివారం నిర్ణయించుకున్నారు. తమ పార్టీ తరఫున ఇద్దరు నేతలను పంపేందుకు ఆమె నిర్ణయించుకున్నారు. అంతకుముందు రోజు ఆమె మాట్లాడుతూ తాను వెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెసు పెద్దల విజ్ఞప్తి మేరకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

14న బాదల్ ప్రమాణ స్వీకారానానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాచ్పాల్ సింగ్, 15న అఖిలేష్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అహ్మద్‌ను పంపనున్నారు. పంజాబ్, యుపి సిఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి మమత వెళ్లాలనుకోవడంపై కాంగ్రెసు పార్టీ బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అఖిలేష్ యాదవ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.

English summary
Keeping the Congress guessing, Mamata Banerjee today decided to skip the swearing- in ceremonies of chief ministers in Punjab and Lucknow, citing business in West Bengal, and send two Trinamool leaders to represent her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X