వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన ఆర్థిక వ్యవస్థే మెరుగు: ప్రతిభా పాటిల్ వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అన్నారు. ఆమె సోమవారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక ఒడిదొడుకుల మధ్య తన ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తి చేసుకుందని ఆమె అన్నారు. మాంద్యం అధికంగా ఉన్నా కూడా ఆర్థిక వృద్ధిరేటు 8 -9 శాతం ఉంటుందని ఆమె చెప్పారు. తాము పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఆమె తెలిపారు 2011లో ఆర్థిక వ్యవస్థ తమకు అంతగా కలిసి రాలేదని ఆమె చెప్పారు. నల్లధనం కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఇ - గవర్నెన్స్ ద్వారా ప్రజా సేవలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

పలు కీలక బిల్లులను ప్రతిపాదిస్తామని ఆమె చెప్పారు. అవినీతిని అంతం చేయడానికి సమర్థమైన బిల్లును తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అన్ని స్థాయిల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమ చెప్పారు. నిజాయితీ, పారదర్శకతతో కూడిన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పోలియోను నిర్మూలించగలిగామని చెప్పారు. వికలాంగుల వ్యవహారాలకు కొత్త శాఖ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. విద్యకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

మెనారిటీలకు సబ్ కోటా కల్సిస్తామని ఆమె హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో యూరియా ఉత్పత్తిలో స్వావలంబన సాధిస్తామని ఆమె చెప్పారు. 2014నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ కేబుల్ ప్రసారాలుఅందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థను కంప్యూటరీకరిస్తామని చెప్పారు అంతర్జాతీయ మార్కెటు ప్రభావంతో దేశంలో ధరలు పెరిగాయని చెప్పారు. భూసంస్కరణలు, పునరావాసానికి కొత్త చట్టాన్ని తెస్తామని ప్రతిభా పాటిల్ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. రైల్వే ఆధునీకరణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. తూర్పు, పశ్చిమ రవాణా సరుకు మార్గాలను సత్వరమే పూర్తి చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలను బ్రాడ్ బ్యాండ్ ద్వారా అనుసంధానిస్తామని చెప్పారు. విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు అదనంగా 24 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపడుతామని చెప్పారు.

English summary
With president Pratibha patil's address to Parkiament today, the budget session of Parliament has begun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X