హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి ఆర్జించారు, జగన్‌పై నో కేసు: సోమయాజులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Somayajulu
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎలా కోట్లు సంపాదించారని, ధీరూబాయ్ అంబానీ సంపన్నుడయ్యారని, అలాగే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంపాదించారని, వైయస్ జగన్‌పై కేసే లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సలహాదారు సోమయాజులు అన్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ అయిన ఆరుగురు మంత్రులను తాము రాజీనామా చేయాలని కోరడం లేదని, వాళ్లు జారీ చేసిన 26 జీవోలు సరైనవా, కావా చెప్పాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సమయం అడగకుండా, సాధ్యమైనంత త్వరగా మంత్రులు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే మంత్రులు జీవోలపై వివరణ ఇవ్వాలని అడుగుతున్నామని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీకి స్పీకర్ మీదనైనా నమ్మకం ఉండాలి లేదా కోర్టుల మీదనైనా నమ్మకం ఉండాలని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై కేసుకు జీవోలే ప్రాతిపదిక అని, ఆ జీవోలు సరైనవా కావా అని తేలిన తర్వాతనే వైయస్ జగన్‌పై కేసు ఉంటుందా, ఉండదా అనేది తేలుతుందని ఆయన అన్నారు. జీవోలు జారీ చేసినవారిని విచారించకుండా వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయి కేసులు వేశాయని ఆయన విమర్శించారు. కాంగ్రెసుకు చెందిన శంకరరావు కేసు వేస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతివాదులుగా చేరారని, దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని తెలిసిపోతోందని ఆయన అన్నారు.

సామాన్య స్థితి నుంచి కోట్లు ఆర్జించిన లగడపాటిపై గానీ, దీరూబాయ్‌పైన గానీ కేసులు వేయలేదని, సామాన్యులు సంపాదించుకునే వెసులుబాటు ఉందని, పరిశ్రమలకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం జీవోలు చేసిందని, అలా రాయితీలు ఇవ్వడం పరిపాటేనని, దాన్ని పట్టుకుని జగన్ ప్రయోజనం పొందారని ఆరోపించి కేసు వేయడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై వేసిన కేసుకు జీవోలతో లింక్ ఉందని, అందువల్ల ముందు జీవోల వ్యవహారం తేలాలని ఆయన అన్నారు. ఎవరిని అడ్డం పెట్టుకుని లగడపాటి ఎదిగారని, ఎవరిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు సంపాదించారని ఆయన అడిగారు. రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమల స్థాపన, వాటి నిర్వహణ సాధ్యం కాదని, వాటికి రాయితీలు ఇచ్చిన విషయంపై ప్రభుత్వం మాట్లాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

English summary
YSR Congress advisor Somayajulu questioned how congress MP Lagadapati Rajagopal earned crores of rupees?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X