హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో మంత్రులకు నోటీసు: సభలో గందరగోళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు పంపిన అంశంపై మంగళవారం శాసనసభలో గందరగోళం చెలరేగింది. కళంకిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వివాదాస్పద జివోలు సభలో స్పీకర్ ముందు పెట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. 26 జివోలు ముందుకు ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించింది. 26 జివోలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిపిఎం నేత జూలకంటి రంగా రెడ్డి డిమాండ్ చేశారు. ఫైళ్లను రహస్యంగా ఉంచడం సరికాదని ఆయన అన్నారు. ఎంఐఎం కూడా జివోలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. మంత్రులు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ గందరగోళంగా మారింది.

స్పీకర్ నాదెండ్ల మనోహర్ విపక్ష సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. సభను సవ్యంగా జరపాలా వద్దా అని వారిని ప్రశ్నించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. అయితే వారు మాత్రం కళంకిత మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. విపక్షాలు మంత్రుల రాజీనామాకు పట్టుబట్టిన సమయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రైవేటు వ్యక్తి వేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. జివోలు సభలో పెట్టే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి చెప్తానని విపక్షాలకు స్పీకర్ చెప్పారు.

English summary
Telugudesam Party MLAs demanded for six minister resignation in Assembly, who get notices from SC in YS Jaganmohan Reddy assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X