• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిబిఐ సూచనలతో గాలి పిఏ అలీఖాన్ లొంగుబాటు?

By Srinivas
|
Gali Janardhan Reddy
బెంగళూరు: మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అలీ ఖాన్ నాలుగు నెలల నుంచి సిబిఐ కనుసన్నల్లో ఉన్నారని, బెంగళూరులో లొంగుబాటు కూడా వారి సూచనల మేరకే జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గాలిని బళ్లారిలో గత ఏడాది సెప్టెంబర్ 5న అరెస్టు చేసినప్పటి నుంచి అలీ ఖాన్ సిబిఐ కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారని, ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశముందని భావించి అన్ని విమానాశ్రయాలకు అలీ ఖాన్‌పై సిబిఐ లుక్ అవుట్ నోటీసులను కూడాజారీ చేసిందని తెలిసిన విషయమే. అయితే గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అధికారులు బెంగళూరుకు విచారణకు తీసుకొచ్చిన సమయంలోనే అలీ ఖాన్ నాటకీయ ఫక్కీలో సిబిఐ కోర్టులో లొంగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. గాలి మైనింగ్ అక్రమాలకు ఆధారాలు కావాలంటే అలీ ఖాన్ కీలకమైన వ్యక్తి అని సిబిఐ అధికారులు గుర్తించారు. కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉన్నందున గాలి మైనింగ్ కంపెనీల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆయనే ఎక్కువగా చూసేవారు. ఆయనను పట్టుకోవాలనుకున్న సిబిఐ ప్రధానంగా ఆయన కుటుంబసభ్యులపై ఆధారపడిందంట. అప్పట్లో అలీ ఖాన్ భార్య గర్భవతి. దీంతో రాత్రి వేళల్లో తరచూ భార్యతో ఫోన్‌లో మాట్లాడటం సిబిఐకి కలిసి వచ్చిందని అంటున్నారు.

ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అలీ ఖాన్ ఆచూకీని వారు కనిపెట్టారట. అలాగే, బళ్లారి పిడబ్ల్యూడిలో డిఈగా పనిచేసే అలీ ఖాన్ మామ ద్వారా కర్ణాటక సిబిఐ అధికారులు అనేక విషయాలు రాబట్టారని సమాచారం. బెంగళూరు, గోవా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలుసుకుని కర్ణాటక సిబిఐలోని ఒక ఉన్నతస్థాయి అధికారి తరచూ అలీ ఖాన్‌తో మాట్లాడేవారనే వాదనలు వినిపిస్తున్నాయి. సిబిఐ అధికారులు చాలా సందర్భాల్లో అలీ ఖాన్‌ను బెంగళూరులోని కొన్ని రహస్య ప్రదేశాల్లో లేదా లాడ్జిల్లో కలిసి కావాల్సిన సమాచారం రాబట్టుకునేవారట. బెంగళూరులో సిబిఐ ఆధికారుల ఎదుట అలీ ఖాన్ లొంగిపోయే ముందు రోజు చాలామందికి ఆ సమాచారం తెలిసిపోయిందట. ఇది సిబిఐ ఆడించిన డ్రామాగానే గాలి వర్గీయులు భావిస్తున్నారు.

కాగా అలీ ఖాన్‌ను బెంగళూరు నుంచి సిబిఐ అధికారులు భారీ బందోబస్తు మధ్య మంగళవారం రాత్రి 8.00 గంటలకు బళ్లారికి తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి నేరుగా బళ్లారి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాత్రి పది గంటల వరకు ఉంచి అనంతరం గాంధీనగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలీ ఖాన్ వస్తున్న విషయం తెలిసి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం అలీఖాన్‌తో సిబిఐ అధికారులు ఏఎంసీ గనుల ప్రాంతాన్ని, వివిధ బ్యాంకుఖాతాలు, లాకర్లను పరిశీలించే అవకాశముంది. ఇప్పటికే బుధవారం ఉదయం ఆయనకు సిబిఐ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It seems, Gali Janardhan Reddy's PA Ali Khan surrender in CBI special court with CBI indications.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more