వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినేష్ త్రివేది రైల్వే బడ్హెట్ 2012-13 ముఖ్యాంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Railway Budget 2012
న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేది బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు లోకసభలో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని చెప్పారు. సామాన్యులపై ఎలాంటి భారం ఉండబోదన్నారు. అతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. త్రివేది బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు...

- రైల్వే భద్రతపై ప్రత్యేక కమిటీ, రైల్వే సేఫ్టీ అథారిటీ ఏర్పాటు, ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రత ఏర్పాటు, ప్రమాదాలు తగ్గించాం, తగ్గిస్తాం
- 40 శాతం ప్రమాదాలు రైల్వే క్రాసింగ్ వద్ద
- రైల్వేల ఆధునీకరణ కోసం రూ.5.60 లక్షల కోట్లు
- రైల్వేల్లో రాబోయే పదేళ్లలో రూ.14 లక్షల కోట్లు అవసరమవుతాయి
- 12వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుబడులు రూ.7.35 లక్షల కోట్లు
- యూరప్, జపాన్ వంటి దేశాలతో పోటీ పడాల్సిన పరిస్థితి
- రైల్వే రీసెర్చ్ డెవలప్‌మెంట్ కౌన్సెల్ ఏర్పాటు
- దేశ సరిహద్దుల్లో రైలు, రోడ్డు రవాణా సమీకృతంగా జరగాల్సి ఉంది
- కమిటీల సిఫారసులు, విజన్ 2020 అమలు చేయాలంటే రూ.14 లక్షల కోట్లు అవసరం
- శామ్ పిట్రోడ ఆధ్వర్యంలో రైల్వేల ఆధునీకరణ కమిటీ
- ఆధునీకరణ ఆళస్యం కావడానికి నిధుల కొరత కారణం
- ఆధునీకరణ ఖర్చు తగ్గింపు, లైన్ల పెంపు
- అయిదేళ్లలో లక్ష్యాలు చేరుకుంటాం, ఐదు లక్ష్యాలు
- ఆధునీకరణ, భద్రత, లైన్ల పెంపు, ఖర్చు తగ్గింపు
- అయిదేళ్లలో రైల్వే క్రాసింగులు పూర్తిగా తొలగిస్తాం
- ప్రైవేట్ రంగానికి పెద్ద పీట
- రైల్వేల భద్రతకు అనిల్ కకోద్కర్ నేతృత్వంలో కమిటీ
- వచ్చే ఏడాదికి రూ.60వేల కోట్లతో ప్రణాళిక
- ఐఆర్ఎఫ్‌సి బాండ్ల ద్వారా రూ.50వేల కోట్ల నిధుల సేకరణ
- వెనుకబడిన ప్రాంతాలకు రైలు సదుపాయం కల్పించాల్సిన అవసరం
- 646 కొత్త లైన్లు కావాలని విజ్ఞప్తులు వచ్చాయి
- రైల్వేలో రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి
- విదేశీ వ్యవహారాలు, రక్షణ వ్యవహారాల్లాగే రైల్వేలకు జాతీయ విధానం అవసరం
- రైల్వేలు లేని భారత దేశాన్ని ఊహించలేం
- రైల్వేల్లో జాతీయ పెట్టుబడులు అవసరం
- రాష్ట్రాల నుండి 5,741 ప్రతిపాదనలు వచ్చాయి
- 19 వేల కిలోమీటర్ల మార్గంలో ట్రాఫిక్ అధికంగా ఉంది, వీటి ఆధునీకరణ
- 2012-2013 రైల్వే బడ్జెట్ మొత్తం రూ.60,100 కోట్లు
- ఆటోమేటిక్ సిగ్నల్ వార్నింగ్ వ్యవస్థతో ప్రమాదాల తగ్గింపు
- విమానాశ్రయాల స్థాయికి 100 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
- కేరళళో 4 రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు
- బకించంద్ర ఛటర్జీ జ్ఞాపకార్థం ప్రదర్శనల ఏర్పాటుకు ప్రత్యేక రైలు
- పెండింగులో ఉన్న 487 రైల్వే ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్లు అవసరం
- మెట్రో నగరాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో 50వేల మందికి ఉపాధి
- ప్రయాణీకుల సౌకర్యాల కోసం రూ.1102 కోట్లు అవసరం
- వచ్చే ఐదేళ్లలో రైల్వే లైన్ల ఆధునీకరణకు రూ.63,212 కోట్లు అవసరం
- దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు
- తొలి రైల్వే స్టేషన్ అయిన చెన్నై రాయపురం స్టేషన్ టెర్మినల్ గా మార్పు
- రైల్వేల సామర్థ్యం పెంపునకు రూ.4410 కోట్లు
- రైల్వే ఉద్యోగులకు ఇళ్లు, సదుపాయల కోసం రూ.1388 కోట్లు
- 111 కొత్త రైల్వే లైన్ల సర్వేకు ప్రతిపాదనలు
- 700 కి.మీ. మేర 45 కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు
- 825 కి.మీ. రైల్వే లైన్ల ఆధునీకరణ
- ప్రయాణ తగ్గింపు, సదుపాయలపై దృష్టి
- హైదరాబాద్ ఎంఎంటిఎస్ రెండో దశకు అనుమతి
- రోలింగ్ స్టాక్స్, వ్యాగన్లు, కోచ్‌ల ఆధునీకరణ
- సిగ్నలింగ్ ఆధునీకరణకు రూ.39,110 కోట్లు
- రైళ్ల వేగాన్ని 160 కి.మీ. పెంచేందుకు చర్యలు
- నవీ ముంబయిలో కోచింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి సన్నాహాలు
- ముంబయిలో 1500 ఎంఎంటిఎస్ కోచ్‌లు ప్రవేశ పెడ్తాం
- ముంబయి ఎంఎంటిఎస్ అభివృద్ధికి రూ.5వేల కోట్లు
- పిర్ పంజల్ రేంజ్ నుంచి 11కిమీ పొడవైన సొరంగం
- ఉదాంపూర్ - బారామల్లా రైల్వే లైన్ విస్తరణ
- లాజిస్టిక్ కార్పోరేషన్, లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు
- కాకినాడ - విశాఖ కారిడార్ లో రైల్వే లైన్ల అభివృద్ధికి నిర్ణయం
- ఈ ఏడాది రూ.1950 కోట్లతో 825కిమీ రైల్వే లైన్ల గేజ్ మార్పిడి
- వచ్చే ఏడాదిలోగా 725 కిమీ. కోత్త లైన్లు పూర్తి చేస్తాం
- పిఠాపురం - కాకినాడ ప్రాజెక్టు ప్రభుత్వం భాగస్వామ్యంలో ఏర్పాటు
- రాయ్ బరేలీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సిద్ధమైంది
- కోల్‌కతాలో మెట్రోకు కొత్త లైన్లు
- కోలార్, కచ్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిర్ణయం
- 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే భద్రతకు రూ.16,482 కోట్లు
- కొత్త లైన్ల కోసం రూ.6,872 కోట్లు
- ఈ ఏడాది 750కి.మీ రైల్వే లైన్ల డబ్లింగ్
- రాష్ట్రాల భాగస్వామ్యంలో 5వేల కిమీ మేర 31 కొత్త ప్రాజెక్టులు
- గుజరాత్ జామ్‌నగర్ లోకో మోటివ్ స్టేషన్
- అగర్తాలా నుంచి బంగ్లాదేశ్‌లోని అఖ్వారాకు రైల్వే సదుపాయం
- మొబైల్ ఎస్సెమ్మెస్‌లను ఈ-టికెట్‌గా పరిగణిస్తున్నాం
- హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేస్తాం
- ఈ ఏడాది అందుబాటులోకి ఛాప్రాలోని రైల్వే చక్రాల ఫ్యాక్టరీ
- వికలాంగుల కోసం ప్రతి రైలులో ఒక కంపార్డుమెంట్
- 200 రైల్వే స్టేషన్‌లను గ్రీన్ ఎనర్జీ స్టేషన్‌లుగా ఆధునీకరణ
- ఏడాదిలో 2500 కోచ్‌లలో బయోలైన్ టాయిలెట్లు ఏర్పాటు
- 2012లో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీ
- రైల్వే బోర్డు పునర్వ్యవస్థీకరణ
- భద్రత, మార్కెటింగ్ కోసం బోర్డులోకి మరో ఇద్దరు డైరెక్టర్లు
- 10 క్రీడాకారులకు ఏటా రైల్ ఖేల్ రత్న ఇస్తున్నాం
- అమృత్‌సర్ భక్తుల కోసం పాట్నా - నాందెడ్ మార్గంలో కొత్త రైలు
- కొత్తగా 21 ప్యాసింజర్లు, 9 డెమోలు
- 85 కొత్త లైన్ల ప్రాజెక్టులు
- సరకు రవాణా ఆదాయం రూ.89,339 కోట్లు
- పెరగనున్న సరకు రవాణా ఛార్జీలు
- 30 శాతం పెరిగిన సరకు రవాణా ఆదాయం అంచనా
- 2012-13 సంత్సరానికి ప్రయాణీకుల ద్వారా రూ.36,073 కోట్ల అంచనా
- 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లు
- ఎంపిక చేసిన రైల్వే స్టేషన్‌లలో ఎస్కలేటర్ల సదుపాయాలు, ఎసి వెయిటింగ్ గదులు
- విపత్తు నిర్వహణలో భాగంగా మూడు శిక్షణా కేంద్రాలు
- మరో 18 నెలల్లో ఉపగ్రహ సాయంతో రైల్వే సమాచారం
- కోచ్‌ల పరిశుభ్రతకు ప్రత్యేక విభాగం
- కిలోమీటరుకు రెండు పైసల చొప్పున సబర్బన్, లోకల్ రైళ్లలో పెంపు
- రైళ్లలో క్యాటరింగ్ సేవలకు గ్లోబల్ టెండర్లు
- అర్జున అవార్డు గ్రహీతలకు రాజధాని, శతాబ్ధి రైళ్లలో ప్రయాణం ఉచితం
- గరీబ్ రథ్ రైళ్లన్నింటిలో వికలాంగుల కోసం ప్రత్యేక కంపార్టుమెంట్లు
- స్వల్పంగా ఛార్జీల పెంపు
- సబర్బన్, లోకల్ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల పెంపు
- కిలోమీటర్‌కు ఎసి రైళ్లలో ఫస్ట్ క్లాస్‌కు 30 పైసలు
- కిలోమీటర్‌కు ఎసి రైళ్లలో సెకండ్ క్లాస్‌కు 15 పైసలు
- కిలోమీటర్‌కు ఎసి త్రీ టైర్‌లో 10 పైసలు పెంపు
- ప్లాట్ ఫాం టికెట్ రూ.3 నుండి రూ.5కు పెంపు
- జనరల్ కంపార్టుమెంట్‌కు కిలోమీటర్‌కు 2 పైసలు
- స్లీపర్ క్లాస్‌కు కిలోమీటర్‌కు 5 పైసలు
- మెయిల్ రైళ్లలో కిలోమీటర్‌కు 3 పైసలు పెంపు

English summary
Minister Dinesh Trivedi presented his first Railway Budget today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X