వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపికి మళ్లీ రైల్వే మంత్రి టోపీ, కిక్కురుమనని ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi
న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేది 2012-13 రైల్వే బడ్జెట్‌లో మన రాష్ట్రానికి టోపీ పెట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న, ముఖ్యమైన లైన్ల పైన దృష్టి సారించలేదు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కరీంనగర్ - నిజామాబాద్ రైల్వే లైనును పట్టించుకోలేదు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైను కోసం ఎప్పటి నుండో స్థానికులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో దీనికి ముహూర్తం కనిపించడం లేదు. రాయ్‌బరేలి కోచ్ ఫ్యాక్టరీ పూర్తయిందని చెప్పడంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కోచ్ ఫ్యాక్టరీలకు ప్రతిపాదనలు చేసిన మంత్రి ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసు ఎత్తలేదు. అదిలాబాద్ - హైదరాబాద్ లైనును గాలికొదిలేశారు. బెజవాడకు కూడా మొండిచేయి చూపారు. విశాఖ జోన్‌‍ను పట్టించుకోలేదు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఎలాంటి హామీ లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, మౌలిక సదుపాయల కల్పనకు మంత్రి నుండి ఎలాంటి హామీ లేకపోవడం బాధాకరమన్నారు. నిత్యం రద్దీగా ఉండే తిరుపతి కొత్తగా ప్రకటించిన రైళ్లలో రాష్ట్రానికి దక్కింది కేవలం మూడు రైళ్లే కావడం గమనార్హం. రాష్ట్రానికి కొత్తగా పదమూడు రైళ్లు వచ్చాయి. కొన్నింటి పైన ఎపి నుండి ప్రతిపాదనలు రాలేదని ద్వివేది చెప్పడం కొసమెరుపు.

కాగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి నష్టం జరుగితే ఊరుకునేది లేదని హెచ్చరించిన మన పార్లమెంటు సభ్యులు మంత్రి ప్రసంగం సాగుతున్నంత సేపు నోరెత్తక పోవడం విశేషం. కాగా బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల తర్వాత చార్జీలు స్వల్పంగా పెరిగాయి. కాగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపారాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బెంగాల్, కేరళ, తమిళనాడులకు అత్యధిక వరాలు కురిపించారన్నారు. రాష్ట్రాన్ని విస్మరించారన్నారు. చార్జీలు పెంచడం వల్ల పేదలపై భారం పడుతుందని అన్నారు.

రైలు ఎక్కడం కంటే దాని కింద పడటం మేలని ప్రయాణీకులు భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు ఢిల్లీలో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రైల్వేలో సంస్కరణలు తీసుకు రావాలన్నారు.

English summary
Minister Dinesh Trivedi presented his first Railway budget today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X