వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: ప్రయాణికులపై చార్జీల భారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Railway Budget 2012
న్యూఢిల్లీ: ప్రయాణికులపై చార్జీల భారం మోపుతూ రైల్వే మంత్రి దినేష్ త్రివేది బుధవారం 2012 -13కు గాను రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రతిపాదించారు. జనరల్ కంపార్టుమెంటు ప్రయాణికులపై కిలోమీటరుకు రెండు పైసల చొప్పున భారం వేశారు. రైల్వే చార్జీల పెంపును నిరసిస్తూ సభ్యులు నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్యనే మంత్రి చార్జీల పెంపును ప్రకటించారు. ఎసి సెకండ్ క్లాస్‌పై కిలోమీటరుకు 15 పైసలు పెంచారు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులపై కిలో మీటరుకు 5 పైసల భారం వేశారు. ఎసి ఫస్ట్ క్లాస్‌పై కిలోమీటరుకు 30 పైసల చొప్పున చార్జీలు పెంచారు. ఎసి త్రీటైర్ చార్జీలను పది పైసలు పెంచారు. టూటైర్ 15 పైసలు పెంచారు. ఎసి థర్జ్ క్లాస్ చార్జీలు కిలోమీటరుకు పది పైసలు పెంచారు. ప్లాట్‌ఫామ్ టికెట్‌ను రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలకు పెంచారు. చార్జీలను హేతుబద్ధం చేస్తున్నట్లు చెబుతూ మంత్రి చార్జీల పెంపును ప్రకటించారు. ప్రయాణికుల ద్వారా 2012 - 13 సంవత్సరానికి 36 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని మంత్రి అంచనా వేశారు. మెయిల్ రైలు చార్జీలను కిలోమీటరుకు 3 పైసల చొప్పున పెంచారు.

సరుకు రవాణా చార్జీలను కూడా పెంచారు. సరుకు రవాణా ఆదాయం 30 శాతం పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. సరుకు రవాణా ఆదాయం 89,339 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. రూ.60,100 కోట్లతో దినేష్ త్రివేది రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. 2012లో రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే శాఖ ఆర్థిక చాలా క్లిష్టమైన పరిస్థితి ఉందని చెబుతూ ఆయన రైల్వే చార్జీల పెంపును ప్రకటించారు. ప్రయాణికుల చార్జీలను మొత్తంగా కిలోమీటరుకు 2 పైసల నుంచి 30 పైసల దాకా పెంచారు. సబర్బన్ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచారు.

English summary
Railway Minister Dinesh Trivedi on Wednesday presented his maiden Railway Budget in Parliament and said the Budget was aimed at the common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X