వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: మమత ఆగ్రహం, దినేష్ త్రివేదికి షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi-Mamata Banerjee
న్యూఢిల్లీ: ప్రయాణికుల చార్జీలు పెంచడంపై రైల్వే మంత్రి దినేష్ త్రివేదిపై తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బడ్జెట్‌లో చార్జీలు పెంచుతూ దినేష్ త్రివేది చేసిన ప్రతిపాదనలను తృణమూల్ కాంగ్రెసు తిరస్కరిస్తోంది. పెంచిన చార్జీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మమతా బెనర్జీ పెంపును ఉపసంహరించుకోవాలని అంటున్నట్లు తెలుస్తోంది.

చార్జీల పెంపును తన పార్టీ బహిరంగంగా తప్పు పట్టిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేసేందుకు దినేష్ త్రివేది సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణికుల చార్జీలు పెంచుతున్న విషయం తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తెలియదని, బడ్జెట్‌కు తాను పూర్తి బాధ్యత వహిస్తానని త్రివేది అన్నారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై తమ పార్టీ రైల్వే మంత్రి దినేష్ త్రివేదితో చర్చించలేదని కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. పేద ప్రజల ప్రయోజనాలను కాపాడాలని తమ నేత మమతా బెనర్జీ తమకు బోధించారని, అందువల్ల చార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ ఆగ్రహాన్ని తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు డెరెక్ ఓబ్రెన్ మొదట వెల్లడించారు. ఉన్నత వర్గాలకు చార్జీలు పెంచితే ఫరవాలేదు గానీ అందరికీ పెంచడం తమకు సమ్మతం కాదని ఆయన అన్నారు.

English summary
The Trinamool Congress has rejected the increase in fares proposed in the Rail Budget presented by Dinesh Trivedi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X