వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినేష్ త్రివేది రైల్వే బడ్జెట్: రాష్ట్రానికి వచ్చేవి ఇవే

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi
న్యూఢిల్లీ: హైదరాబాద్ - సికింద్రాబాద్ ఎంఎంటిఎస్ రైల్వే రెండో దశకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి దినేష్ త్రివేది తన బడ్జెట్ ప్రతిపాదనల్లో చెప్పారు. ఎంఎంటిఎస్ రెండో దశకు గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కాకినాడ - విశాఖ కారిడార్‌లో రైల్వే లైన్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాకినాడ - విశాఖ తీర్ ప్రాంత రైల్వే లైన్ల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతామని ఆయన చెప్పారు.

కాకినాడ - పిఠాపురం ప్రాజెక్టును ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు భూమిని, నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. కొన్ని ప్రాజెక్టులకు తన వంతు వ్యయాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. మెదక్ - అక్కన్నపేట, భద్రాచలం - కోవూరు మధ్య రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన పలు రైల్వే లైన్లు ప్రణాళికా సంఘం పరిశీలనలో ఉన్నాయి.

కొండపల్లి - కొత్తగూడెం, మణగూరు - రామగండం, పాండురంగాపురం - భద్రాచలం, పిడుగురాళ్ల - నరసారావుపేట, కదిరి - పుట్టపర్తి, రాయదుర్గం - ఆవులదర్గా మధ్య రైల్వే లైన్ల ప్రతిపాదనలు చేశారు. పరిశీలనలో ఉన్న రైల్వే లైన్లు... కొండపల్లి - కొత్తగూడెం, మణుగూరు - రామగుండం, కదరి - పుట్టపర్తి, శ్రీనివాసపురం - మదనపల్లి, చిక్‌బళ్లాపూర్ - పుట్టపర్తి, జహీరాబాద్ - సికింద్రాబాద్, పాండురంగాపురం - భద్రాచలం, పిడుగురాళ్ల - నర్సారావుపేట ఉన్నాయి.

కొవ్వూరు - భద్రాచలం రైల్వే లైను పూర్తి చేయాలని నిర్ణయించారు. గుణుపూరు - నర్సీపట్నం, మచిలీపట్నం - రేపల్లే వయా నిజాపట్నం సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. కాజీపేట - విజయవాడ మూడో రైల్వే లైనుకు అనుమతి ఇచ్చారు. కోరుకొండ - విజయనగరం, తాడిపత్రి - రాయలచెర్వుకు డబ్లింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య వారానికి మూడు రోజులు ఎపి ఎక్స్‌ప్రెస్, బీదర్ సికింద్రాబాద్ మధ్య వారానికి ఆరు రోజులు ఇంటర్ సిటీని నడపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - షాలిమార్ మధ్య కొత్త ఎసి ఎక్స్‌ప్రెస్‌కు అనుమతి లభించింది. ఆంధ్ర ప్రదేశ్ భాగస్వామ్యంలో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు. కోటిపల్లి - నర్సాపూర్, కడప - బంగారుపేట, నడికుడి - శ్రీకాళహస్తి, విజయవాడ - మచిలీపట్నంలు పూర్తి చేయనున్నారు.

English summary
Railway Minister Dinesh Trivedi agreed for Hyderabad MMTS second phase and allocated funds in his Railway Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X