వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: మమతకు ప్రశంసలు, సేఫ్టీకి ప్రాధాన్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi
న్యూఢిల్లీ: రైల్వే భద్రత విషయంలో ఇప్పుడున్న ప్రమాణాలతో తాను సంతృప్తిగా లేనని రైల్వే మంత్రి దినేష్ త్రివేది చెప్పారు. ఆయన బుధవారం పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌‍ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసినవారి పేర్లను ఆయన బడ్జెట్ ప్రతిపాదనకు ముందు ప్రస్తావించారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసినవారి నుంచి చాలా నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికుల భద్రత తమ కర్తవ్యమని ఆయన చెప్పారు. అందురు రైల్వే సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేను ఆధునీకరణకు పెద్ద పీట వేస్తూనే భద్రతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 40 శాతం ప్రమాదాలు రైల్వే క్రాసింగ్‌ల వద్దే జరుగుతున్నాయని ఆయన అన్నారు. రైల్వే ప్రమాదాలను తగ్గించామని, ఇంకా తగ్గిస్తామని ఆయన చెప్పారు.

ప్రస్తుతం దేశంలో ఆశించిన స్థాయిలో ప్రమాణాలు లేవని ఆయన అన్నారు. ప్రమాదాల్లో ఒక్క మరణాన్ని కూడా సహించబోమని ఆయన హామీ ఇచ్చారు. హైస్పీడ్ రైల్వే సేఫ్టీ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. విదేశాల్లో హైస్పీడ్ రైళ్లు ఉన్నా ప్రమాదాలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. భద్రత విషయంలో ఐరోపా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. 14 లక్షల మంది ఉద్యోగులే రైల్వే బలమని ఆయన అన్నారు. ఆధునీకరణలో జాప్యం జరగడానికి నిధుల కొరత కారణమని ఆయన అన్నారు.

English summary
Railway Minister Dinesh Trivedi praised Mamata Banerjee and gave importance to safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X