హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీనా, శివరాంలపై ఎసిబి కేసు, ఎమ్మార్ స్కామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sivarama - Br Meena
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం వ్యవహారంలో ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ మీనాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టులో న్యాయవాది వల్లూరి సాయినాథ్ మంగళవారం వేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మార్‌లో విల్లాలు, ప్లాట్లు కొన్న వారిని వేధింపులకు గురిచేశారని, ఎమ్మార్ ప్రతినిధుల నుంచి రూ.35కోట్ల విలువైన విల్లాలు డిమాండ్ చేశారని, వీరిద్దరి చర్య వల్ల ఏపీఐఐసీకి సుమారు రూ.600 కోట్ల నష్టం వచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.

విల్లాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి సుమారు 6,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని, అయితే అవి నిలిచిపోయేలా ఉత్తర్వులు జారీ చేయించడం వల్ల అందులో పదిశాతం వాటాను ఏపీఐఐసీ నష్టపోయిందని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చడం, అవినీతి ఆరోపణలపై శివరామసుబ్రహ్మణ్యం, బీఆర్ మీనాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏసీబీని ఆదేశించాలంటూ సాయినాథ్ కోర్టును కోరారు. ఆమేరకు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మార్ విల్లాలు, ప్లాట్లను షరతులతో కూడిన రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీఐఐసీ అధికారుల బృందం సీబీఐ అధికారులను కలిసింది. ఇదే అంశంపై వారు చర్చించినట్లు సమాచారం. ఎమ్మార్ కేసుకు సంబంధించి అధికారులు సీబీఐ కోర్టులో త్వరలోనే అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎమ్మార్-ఎంజీఎఫ్ ప్రతినిధులు కూడా సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ ప్రాజెక్టు ప్రతినిధులు, కొందరు బ్యాంకు అధికారులను సీబీఐ విచారించింది.

English summary
ACB court has ordered to file case against BR Meena and Sivarama subrahmaniam in EMAAR scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X