విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ గజినీ, అభివృద్ధి ఏది?: లగడపాటిపై వల్లభనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamshi
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ గురువారం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై విమర్శలు చేశారు. లగడపాటి బెజవాడ పాలిట గజినీ అన్నారు. ఆయన ఆది నుండి అన్నీ మరిచిపోతుంటారని విమర్శించారు. బుధవారం మంత్రి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో విజయవాడకు మొండిచేయి చూపారని విమర్శించారు. విజయవాడకు ఒక్క రైలు రాలేదన్నారు. లగడపాటి నిత్యం గోవాలో ఏ ప్రభుత్వం వస్తుంది? ఉత్తర ప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారు? అని జోస్యాలు చెప్పడం మానాలన్నారు. ఎన్నికల ఫలితాలపై జూదం కాసేవాడిగా కాకుండా గెలిపించిన నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

విజయవాడకు ఎంపీనని గుర్తుంచుకోవాలన్నారు. లగడపాటి గతంలో ఇచ్చిన హామీలు అన్నీ మరిచి పోయారన్నారు. విజయవాడకు అన్యాయం జరిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వైఫల్యంతోనే ఈ దుస్థితి అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. భవానీ ద్వీపం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కనకదుర్గ గుడి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే వారు విచారణలో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందన్నారు.

English summary
TDP leader Vallabhaneni Vamsi blamed that MP Lagadapati Rajagopal is Bejawada Gajini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X