చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాసలీలల సీడిల్లో మేం కాదు: రంజితతో నిత్యానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swamy-Ranjitha
చెన్నై: రాసలీలల సీడిల్లో ఉన్నది తాము కాదని నిత్యానంద స్వామి అన్నారు. సినీ నటి రంజితతో కలిసి ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ సీడీల్లో ఉన్నది తాము కాదని, డబ్బుల కోసం నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ సీడీలను తయారు చేశారని, ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నలుగురు నిపుణులు తేల్చారని ఆయన అన్నారు. డబ్బుల కోసం నాటకాలు ఆడారని ఆయన అన్నారు. తమ నుంచి 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, చివరికి 60 కోట్లకు దిగి వచ్చారని ఆయన చెప్పారు.

తమను ఇరికిస్తూ రూపొందించిన సీడిలను తాము కోర్టుకు సమర్పిస్తామని ఆయన చెప్పారు. తమను డబ్బులు డిమాండ్ చేసినవారు నేరాలు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న నటి రంజిత తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారు. చాలా కాలం తెర వెనక ఉండిపోవడానికి కారణం ఏమిటని అడిగితే తాను మహిళను, పబ్లిక్ ఫిగర్‌ను, మంచి నటిగా ఎదుగుతున్న సమయంలో అశ్లీల సీడీలో తనను ఇరికించారని, అందుకే అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వంచిందని ఆమె చెప్పారు.

నిత్యానంద తనకు గురువు, దైవం మాత్రమే కాకుండా జీవితాన్ని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అని, రక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని తామే చెప్పామని ఆమె అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎందుకు ముందుకు రాలేదని అడిగితే, అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిపై తమకు నమ్మకం లేదని చెప్పారు.

English summary
Nityananda said that few people staged drama with fake CDs for money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X