వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే త్రివేది తొలగింపు, మరొకరికి స్థానం: ప్రధాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: అవసరమైతే రైల్వే మంత్రి దినేష్ త్రివేదిని తొలగించి, ఆ స్థానంలో మరొకరిని తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీకి చెప్పినట్లు తెలుస్తోంది. పరిస్థితి వస్తే త్రివేదిని తొలగించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. దినేష్ త్రివేది రాజీనామా చేయలేదని అంతకు ముందు లోకసభలో సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. మమతా బెనర్జీ విజ్ఞప్తికి సంబంధించి ప్రధానికి సమాచారం అందిన మాట నిజమేనని, దాన్ని ప్రధాని పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు.

దినేష్ త్రివేది నుంచి రాజీనామా లేఖ ప్రధానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము తీసుకునే చర్యను సభకు తెలియజేస్తామని ఆయన అన్నారు. విధుల నుంచి తాను పారిపోలేనని ప్రభుత్వం నుంచి వివరణ వచ్చిన తర్వాత దినేష్ త్రివేది మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామా చేయాలని తనను మమతా బెనర్జీ గానీ మన్మోహన్ సింగ్ గానీ అడగలేదని ఆయన చెప్పారు. రాజీనామా చేయాలని వారు సూచిస్తే వెంటనే చేస్తానని ఆయన చెప్పారు.

English summary
The PM has said that the government will consider a replacement for Dinesh Trivedi if the situation arises, when asked about Mamata's request to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X