వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత కాంప్లెక్స్‌లు

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత సముదాయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. త్వరలో ప్రత్యక్ష పన్నుల విధానాన్ని ప్రవేశ పెడ్తామని ఆయన చెప్పారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రయత్నాలు సాగుతాయని ఆయన అన్నారు. రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డిఐల కోసం ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు సాగుతాయని ఆయన అన్నారు.

ఐపివో ప్రక్రియను సరళతరం చేస్తామని ఆయన చెప్పారు. విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులపై పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగుతుందని ఆయన అన్నారు. కిరోసిన్, వంటగ్యాస్ లబ్ధిదారులకు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ అందించే ప్రక్రియను చేపడతామని చెప్పారు. మౌలిక రంగంలో పెట్టుబడులకు పన్ను రాయితీ కల్పిస్తామని ఆయన అన్నారు. వేయి జనాభా ఉన్న పల్లెలకు స్వాభిమాన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లోనే మైక్రో ఫైనాన్స్ నియంత్రణ బిల్లు ప్రతిపాదిస్తామని చెప్పారు.

English summary
Finance Minister Pranab Mukherjee, in his budget speech said that Handloom Complexes will be created in Guntur and Prakasam districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X