వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2012 - 13: ప్రైవేట్ భాగస్వామ్యంపై దృష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాందగమనంతో ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. యూరప్ సంక్షోభం, మధ్య ప్రాచ్య రాజకీయాల ప్రభావం ఉందని, ముడి చమురు, ప్రపంచ పరిస్థితులను గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 2011 -12 లో జిడిపి వృద్ధి రేటు నిరుత్సాహంగా ఉందని ఆయన అన్నారు. వృద్ధిరేటు తగ్గుదల తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. వ్యవసాయం, సేవల రంగం మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు దేశీయ అవసరాలు తీర్చేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్థిక పునరుజ్జీవనానికి ఐదు సూత్రాల పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తయారీరంగం పురోగతి సాధిస్తోందని ఆయన చెప్పారు. 2011లో ద్రవ్యోల్బణ సమస్య తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. పారిశ్రామిక వృద్ధిరేటు మందగించడం వల్ల వృద్ధిరేటు తగ్గిందని ఆయన అన్నారు. ప్రజాజీవితంలో అవినీతికి, నల్లధనానికి చోటు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణలో రాష్ట్రాల సహకారం గణనీయంగా ఉందని ఆయన చెప్పారు.

ఎగుమతులకు కొత్త మార్కెట్లనను అన్వేషించడంలో ఫలితం సాధించడం వల్ల సంక్షోభం నుంచి బయటపడినట్లు ఆయన చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల విస్తరణలో ప్రగతి సాధించినట్లు తెలిపారు. 2011 - 12లో ముడిచమురు ధరల ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. ఆసియా దేశాలకు ఎగుమతులు 33 శాతం నుంచి 50 శాతానికి పెరిగినట్లు ఆయన తెలిపారు. 2012 - 13లో వృద్ధిరేటు 7.6 శాతం ఉంటుందని ఆయన అంచనా వేశారు.

English summary
Finance Minister Pranab Mukherjee advocated private partnership to fulfill the needs of the country, in his budget 2012 - 13.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X