వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2012: పార్లమెంటుకు చేరుకున్న ప్రణబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఏడోసారి తన మార్కు బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిద్ధమయ్యారు. ఆయన శుక్రవారం ఉదయం పార్లమెంటుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్‌లో కాస్తా ఊరట లభించవచ్చునని భావిస్తున్నారు. పన్ను విధింపునకు ఆదాయ పరిమితిని రూ 2 లక్షల రూపాయలకు పెంచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

టాక్స్ బ్రాకెట్స్‌పై ఆదాయం పన్ను పరిమితిని 10, 20, 30 శాతం పెంచవచ్చునని అంటున్నారు. చౌక ధర ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే 15 లక్షల రూపాయల రుణంపై ఒక శాతం వడ్డీ విధించే అవకాశాలున్నాయి. లగ్జరీ సరుకులపై సుంకాలను పెంచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. గురువారం పార్లమెంటు ముందు ఉంచిన ఆర్థిక సర్వే కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

English summary
Finance Minister Pranab Mukherjee will unveil the Union Budget 2012-13 in the Lok Sabha on Friday. He reached Parliament and will present the Budget at 11 am
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X