హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి, భారీ భద్రత

By Pratap
|
Google Oneindia TeluguNews

EVM
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు శానససభా నియోజకవర్గాలకు రేపు ఆదివారం పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బంది శనివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు తరలిపోయారు. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి రేపు (ఆదివారం) పోలింగ్ జరగుతుంది. కోవూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసు అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో లక్షా 95 వేల పైచిలుకు ఓటర్లున్నారు. నియోజకవర్గంలోని 45 గ్రామాలను అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో లక్షా 72 వేల మంది పైచిలుకు ఓటర్లున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్థానికంగా వీడియో గ్రాఫర్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వీడియో గ్రాఫర్లను పిలిపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌కు ముందు నాగర్ కర్నూలులో హైడ్రామా చోటు చేసుకుంది. తెరాస మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు హంగామా సృష్టించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో కూడా పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డిలో కూడా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోలతో ఓటంగు ప్రక్రియను రికార్డు చేయనున్నారు.

English summary
Arrangements were made for polling in seven assembly segments of AP tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X