వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునీల్ రెడ్డి కంపెనీల రూ. 45 కోట్లు తేలాల్సిందే: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితుడు సునీల్ రెడ్డి కంపెనీల్లోకి రూ.45 కోట్లకుపైగా నిధులు వచ్చినట్లు గుర్తించామని, అవి ఎలా వచ్చాయో తెలియాలని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఎమ్మార్‌లో విల్లాలను ఎక్కువ మొత్తాలకు విక్రయించడం ద్వారా వచ్చిన రూ.96 కోట్లకు సంబంధించిన వివరాలు సునీల్ రెడ్డికి తెలుసునని, అయినా ఆయన వెల్లడించడం లేదని, దానిపైనే దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ సునీల్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి.

సునీల్ తరపున సుప్రీం న్యాయవాది సుశీల్ కుమార్ వాదిస్తూ.. "తుమ్మల రంగారావుకు ఏ నిబంధనల ప్రకారం బెయిల్ మంజూరు చేశారో వాటి ప్రకారమే మా క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలి. కొన్ని కంపెనీల నుంచి 2007లో సునీల్ రూ.45 కోట్లు స్వీకరించారని అంటున్నారు. అంత డబ్బు ఏమైందో మాత్రం చెప్పలేదు. అంత డబ్బును ఎవరూ ఇంట్లో పెట్టుకోరు కదా! సీబీఐ ఆ వివరాలను ఎందుకు చెప్పలేదు'' అని అన్నారు.

"సునీల్ డైరెక్టరుగా ఉన్న సౌత్ ఎండ్ ప్రాజెక్ట్సులోకి 10 కంపెనీల నుంచి రూ.45 కోట్లు వచ్చాయి. అవి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినవి కాకపోవడం అనుమానాలు రేపుతోంది. అదే కంపెనీలో డైరెక్టరుగా ఉన్న మనోహర్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరును అనుమానిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనినిబట్టి, వీరిద్దరి మధ్య కొంత వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ దశలో సునీల్‌కు బెయిల్ ఇవ్వొద్దు'' అని అన్నారు. వాదనలు పూర్తవడంతో జడ్జి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.

తనపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మార్ కేసు నిందితుడు తుమ్మల రంగారావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసులు ఎత్తివేస్తే తాను అప్రూవర్‌గా మారతానని ఆయన కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో వాదనలు వినిపించేందుకు డిఫెన్స్ న్యాయవాది సమయం కోరడంతో న్యాయమూర్తి అందుకు ఆమోదం తెలిపారు. ఇదే కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ రిమాండ్‌ను మార్చి 30కి పొడిగించారు.

English summary
CBI has said to court that sunil Reddy, accused in EMAAR case should reveal about Rs 45 crores amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X