వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ప్రమేయం లేదు, అధిష్టానమే నిర్ణయిస్తుంది: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తమ ప్రమేయం లేదని, అభ్యర్థులను అధిష్టానమే నిర్ణయిస్తుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రూపొందించి తాను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఉమ్మడి జాబితాను అధిష్టానానికి సమర్పించామని, తాము సూచన మాత్రమే చేశామని, అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను, ముఖ్యమంత్రి ఈ రోజు సోనియా గాంధీని కలిశామని, పార్టీ పరిస్థితినీ రాష్ట్ర పరిస్థితిని వివరించామని, పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తామని ఆయన అన్నారు.

మంత్రి వర్గ నిర్ణయాలకు సమిష్టి బాధ్యత ఉంటుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోల్లో ఇప్పటికే 24 జీవోలు సిబిఐ విచారణ పరిధిలో ఉన్నట్లు తనకు సమాచారం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిపై తనపై వేసిన కేసుల్లో స్టే తెచ్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం రేపు ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.

English summary
PCC president Botsa Satyanarayana said high command will decide Rajyasabha candidates list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X