వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం క్యాంప్‌లోకి జయాబచ్చన్: అంబానీ వల్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaya Bachchan
న్యూఢిల్లీ: అమర్ సింగ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్న సినీ నటి జయాబచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ క్యాంప్‌లోకి తిరిగి వచ్చారు. గత రెండేళ్లుగా ఆమె ములాయం సింగ్ యాదవ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబంతో ములాయం సింగ్ యాదవ్ సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నారు. ఆమె రాజ్యసభ సీటుకు నామినేషన్ వేయడమే అందుకు నిదర్శనం. అర్వింద్ కుమార్ సింగ్ స్థానంలో ఎస్పీ జయా బచ్చన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించుకుంది.

అమితాబ్ కుటుంబంతో ఎస్పీ సంబంధాల పునరుద్ధరణలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రమాణస్వీకారానికి అంబానీ, జయా బచ్చన్ గురువారం లక్నోకు వెళ్లినట్లు చెబుతున్నారు. అమర్ సింగ్ మినహా మిగతావారిని ములాయం సింగ్ చేరదీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. జయా బచ్చన్ బయటకు వెళ్లలేదని, ఆమె పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలని, గతంలో ఆమె నామినేషన్‌ను వేయడానికి నిరాకరించారని, ఇప్పుడు అంగీకరించారని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు.

English summary
Jaya Bachchan has decided to be Samajwadi Party (SP) MP again, putting the first family of Bollywood back in the Mulayam Singh Yadav camp after two years when the ties had soured over Amar Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X