వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు త్రివేది కొత్త కొలికి: రాతలో ఇవ్వాల్సిందే

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi
కోల్‌కత్తా: రాజీనామా చేయాలని పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు రాతపూర్వకంగా లేఖ ఇవ్వాల్సిందేనని రైల్వే మంత్రి దినేష్ త్రివేది అన్నారు. రైల్వే చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని మమతా బెనర్జీ త్రివేదిని ఆదేశించడమే కాకుండా మంత్రివర్గం నుంచి త్రివేదిని తప్పించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన విషయం తెలిసిందే. రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెసు చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ టెలిఫోన్‌లో త్రివేదికి సూచించారు. గౌరవంగా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే వేటు వేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

పార్టీ నిర్ణయాన్ని మమతా బెనర్జీ తనకు రాతపూర్వకంగా తెలియజేయాలని త్రివేది అన్నట్లు బెనర్జీ చెప్పారు. రాతపూర్వకంగా రాజీనామా చేయాలని సూచించాలని త్రివేది అడగడం సరైంది కాదని ఆయన అన్నారు. మంత్రి పదవి తీసుకునేప్పుడు రాతపూర్వకంగా ఇవ్వాలని త్రివేది అడగలేదని ఆయన అన్నారు. మంత్రి పదవి తీసుకోవాలని పార్టీ సూచించినందున త్రివేదికి మంత్రి పదవి దక్కిందని, పార్టీ దిగిపోవాలని సూచించినప్పుడు గౌరవంగా తప్పుకోవాలని బెనర్జీ అన్నారు.

రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదించిన వెంటనే త్రివేదిని మంత్రి పదవి నుంచి తప్పించాలని మమతా బెనర్జీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు. అయితే, మమతా బెనర్డీతో ప్రదానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడి కొంత సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నెల17వ తేదీ తర్వాత త్రివేది మంత్రి పదవిపై ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

English summary
Railway minister Dinesh Trivedi, who has earned his party's wrath for hiking passenger fares in the Railway Budget, was on Saturday asked by it to quit his post but he insists that Mamata Banerjee should make the demand in writing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X