వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందు జోరుగా తర్వాత మందకోడిగా.. ఓటింగ్ శాతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kovvur
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలలో జరుగుతున్న పోలింగ్ తొలుత జోరుగా ప్రారంభమై మధ్యాహ్నానికి మందకోడిగా నడుస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అప్పుడే ఓటర్లు భారీగా తరలి వచ్చారు. క్యూలైన్లలో నిలుచుకున్నారు. పదకొండు గంటల వరకు జనాలు భారీగా ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో తొలి రెండు గంటల్లోనే భారీ ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత ఎండ కారణంగా పోలింగ్ శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సాయంత్రం మూడు గంటల నుండి మళ్లీ ఓటింగ్ శాతం పెరిగే అవకాశముంది. పోలింగ్ ఐదు గంటల వరకు కొనసాగుతోంది.

కాగా ఆయా నియోజకవర్గాలలో కడపటి సమాచారం అందే సమయానికి... కొవూరులో 45 శాతం, మహబూబ్ నగర్‌లో 38 శాతం, నాగర్ కర్నూలులో 39 శాతం, కొల్లాపూరులో 38 శాతం, స్టేషన్ ఘనపూర్‌లో 40 శాతం, కామారెడ్డిలో 40 శాతం, అదిలాబాద్‌లో 40 శాతం ఓటింగ్ నమోదయింది. కాగా మహిళలు భారీ ఎత్తున ఓటింగ్ కోసం తరలి వస్తున్నారు.

English summary
Polling percent in Kovvur is 45, 38 percent in M.Nagar, 39 percent in Nagarkurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X