నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కడప' దాటిన జగన్‌కు తొలి సవాల్: పరువు దక్కేనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
నెల్లూరు: కోవూరు ఉప ఎన్నిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఒక్క స్థానం వ్యక్తిగతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే కాకుండా, ఆయన పార్టీ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో ఐదింట తెలంగాణ వాదం పేరిట అభ్యర్థులను పోటీకి దించని జగన్ పార్టీ, శాసనసభ్యుడి మృతితో ఖాళీ అయిన మహబూబ్‌నగర్‌లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలంగాణలో రాబోయే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇదంతా జగన్ పార్టీ వేసిన ఎత్తుగడగా ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టిడిపికి రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థిగా కోవూరు నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించుకోవటం ఇప్పుడు జగన్‌కు అనివార్యంగా మారింది. పైగా ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో తాము పోటీ చేస్తున్న ఒకే ఒక్క స్థానం కోవూరే కావటంతో దానిని కూడా గెల్చుకోలేకపోతే పరువు పోతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. దీంతో జగన్ పార్టీ శ్రేణులన్నీ అక్కడే మోహరించాయి. జగన్ స్వయంగా కోవూరులో వారానికి పైగా ప్రచారం చేశారు. కోవూరు ఉప ఎన్నికను జగన్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించటానికి, కడప ఉప ఎన్నికల తర్వాత చట్ట సభలకు సంబంధించి ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే కావటం కూడా ఒక కారణం.

జగన్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కోవూరులో ప్రసన్న గెలుపుతో పాటు, ఆయన సాధించే మెజారిటీ కూడా ముఖ్యమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కోవూరులో ప్రసన్న ఓడిపోతే ఒక రకంగా జగన్‌తో పాటు, ఆయన పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ప్రసన్న గెలిచి, మెజారిటీ తక్కువగా వచ్చినా జగన్ పార్టీకి ఇబ్బందికరమేనని చెబుతున్నారు. అప్పుడు జగన్‌కు కడపలో తప్ప మిగిలిన చోట్ల పట్టు లేదనే ప్రచారం సహజంగానే తెర పైకి వస్తుంది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు జగన్‌కు వ్యతిరేకంగా మరింత క్రియాశీలకమవుతాయి. ఇది త్వరలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవూరు ఉప ఎన్నిక జగన్‌కి, ఆయన పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.

స్వయంగా జగనే బరిలో ఉన్నంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికను ఆ పార్టీ నేతలు తీసుకుంటున్నారు. ఇక్కడ తమ పార్టీ గెలిస్తే జగన్ గెలిచినట్లేనని, ఓడితే జగన్ ఓడిపోయినట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానమే తమకు ఓట్లు కురిపిస్తుందని తొలుత భావించినా, జగన్ రోడ్‌షోలు వెలవెలపోయినట్లుగా వార్తలు రావడం, మైపాడులో మత్స్యకారులపై జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది దాడులు చేసిన ఉదంతాలు వారిని కలవరపరుస్తున్నాయట.

English summary
Kovvur is big challenge to YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X