వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతకు చుక్కలు!: రైల్వే మంత్రిని నేనే అన్న త్రివేది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dinesh Trivedi-Mamata Banerjee
న్యూఢిల్లీ: ఇప్పటికీ రైల్వే మంత్రిని తానేనని దినేశ్ త్రివేది ఆదివారం మరోసారి ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే తనకు ఎంతో గౌరవమని ఆయన తెలిపారు. రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన తదనంతర విభేదాలకు తమ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ కారణమని ఆయన ఆరోపించారు. ఇది దేశం కోసం ఆలోచించాల్సిన సమయం కానీ రాజకీయ గురించి కాదని హితవు పలికారు. తాను మమతను కలిసి మాట్లాడలేదని, మమత గొప్ప నేత అని చెప్పారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు చెప్పే హక్కు ఉందని చెప్పారు. కాగా త్రివేది నాలుగు రోజుల క్రితం బడ్జెట్ ప్రవేశ పెట్టాక తృణమూల్, యుపిఏ మధ్య బీటలు వారిన విషయం తెలిసిందే. త్రివేది రాజీనామా చేయమని మమత ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని త్రివేది చెప్పుకొచ్చారు.

శనివారం మరోసారి తృణమూల్ త్రివేది రాజీనామాను కోరింది. అయితే పార్టీ అధినేత్రి నుండి లిఖిత పూర్వక ఆదేశాలు వస్తే గానీ, మంత్రి పదవిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. మౌఖిక ఆదేశాలు పట్టించుకోనని చెప్పారు. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది తానేనని, దానిపై చర్చకు సమాధానం కూడా తానే ఇస్తానని చెప్పారు. ప్రధాని తొలగించినా, మమత లేఖ రాసినా అప్పుడే పదవి నుండి తప్పుకుంటానని చెప్పారు. మరోవైపు తాము లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చేది లేదని తృణమూల్ అధిష్టానం తేల్చి చెప్పింది. మొత్తానికి రైలు బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యుపిఏకు షాక్ ఇవ్వాలనుకున్న మమతకు ఇప్పుడు అదే పార్టీ నేత త్రివేది రాజీనామాపై మెలికలు పెడితూ చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు దినేష్ త్రివేతి సోమవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

English summary
Dinesh Trivedi said today that he is the Railway Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X